వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్మలా సీతారామన్‌కు మరో అరుదైన అవకాశం... భారతదేశ రెండవ ఆర్థిక మంత్రి

|
Google Oneindia TeluguNews

కేంద్రమంత్రి నిర్మలా సీతారమన్‌కు మరో అరుదైన అవకాశం దక్కింది. భారత దేశ పార్లమెంట్ చరిత్రలోనే ఇప్పటి వరకు మహిళలకు దక్కని ఆర్ధిక శాఖను ప్రధాన మంత్రి మోడీ నిర్మలా సీతరామన్‌కు కేటాయించాడు. కాగా ఆర్ధిక శాఖను స్వతంత్ర భారత దేశ పార్లమెంట్ పూర్తిస్థాయి క్యాబినెట్ మహిళ మంత్రిగా బాద్యతలు నిర్వహించలేదు. అయితే ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ 1970-71లో సంవత్సర కాలం పాటు తానే అర్ధిక శాఖ బాధ్యతలు చేపట్టారు. కాగా నిర్మలా సీతరామన్ అంతకు ముందు భారత చరిత్రలోనే మొదటి డిఫెన్స్ మినిస్టర్‌గా పూర్తి బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే...

17వ లోక్‌సభ ఎన్నికలో మహిళకు కీలక స్థానం

17వ లోక్‌సభ ఎన్నికలో మహిళకు కీలక స్థానం

17వ లోక్‌సభలో ప్రధానమంత్రిగా మొత్తం 58మందితో కూడిన మంత్రి వర్గం కొలువుదీరింది. దీంతో ఆయన క్యాబినెట్‌లో 24 మందికి చోటు కల్పించారు. ఇక మోడీ క్యాబినెట్‌లో ముగ్గురు మహిళలకు మాత్రమే అవకాశం కల్పించారు. అందులో నిర్మలా సీతరామన్ ఒకరు.ఆమే 2014లో కామర్స్ అండ్ ఇండస్ట్ట్రీ మంత్రిగా ఇండిపెండెంట్ బాద్యతలు చేపట్టారు. అనంతరం మొదటి మహిళా డిఫెన్స్ మినిస్టర్‌గా బాధ్యతలు 2017లో చేపట్టారు. ఇక ఇప్పుడు రెండవ సారి చేపట్టిన క్యాబినెట్ విస్తరణ పూర్తిస్థాయి క్యాబినెట్ మంత్రిగా ఫైనాన్స్ మరియు కార్పోరేట్ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చేపట్టింది.

కర్ణాటక నుండి రాజ్యసభకు ఎన్నికైన నిర్మలా సీతరామన్..

కర్ణాటక నుండి రాజ్యసభకు ఎన్నికైన నిర్మలా సీతరామన్..

కాగా నిర్మలా సీతరామన్ కర్ణాటక రాష్ట్ట్రం నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆమే తమిళనాడులోని సీతాలక్ష్మీ రామస్వామీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఢిల్లీలోనే జేఎన్‌యూలో ఎంఫిల్ పూర్తి చేశారు.ఇక ఇంతకు ముందు మోడీ క్యాబినెట్‌లో ఆర్ధిక శాఖను నిర్వహించిన అరుణ్ జైట్లీ అనారోగ్య కారణంతో ప్రభుత్వ బాధ్యతలకు దూరంగా ఉన్నారు.దీంతో నిర్మలా సీతరామన్‌కు ఆర్ధిక శాఖను చేపట్టే అవకాశం దక్కింది.

ఎక్కువ కాలం పాటు ఆర్ధిక శాఖను చేపట్టిన చిదంబరం

ఎక్కువ కాలం పాటు ఆర్ధిక శాఖను చేపట్టిన చిదంబరం

ఇక మొత్తం స్వతంత్ర్య భారత దేశంలో ఇప్పటి వరకు 24 మంది ఆర్ధికశాఖను చేపట్టారు.కాగా అందులో ప్రధానమంత్రులుగా ఉన్న,జవహార్‌ లాల్ నెహ్రు, ఇందిరాగాంధీ , రాజీవ్ గాంధీ ,మన్మోహన్ సింగ్ లు ఆర్ధిక శాఖను చేపట్టారు. మరోవైపు ఆర్ధిక శాఖను నాలుగు సార్లు చేపట్టి సుమారు ఏనిమిది సంవత్సరాల పాటు , ఆర్ధిక శాఖను నిర్వహించిన వారిలో పి. చిదంబరం ఉన్నాడు.ఇక చరిత్రలో మొదటిసారగి ప్రధానమంత్రి బాద్యతలు నిర్వహించడంతో పాటు ఆర్ధిక శాఖను కూడ నిర్వహించిన మహళగా కూడ ఇందిరా గాంధీ నిలిచారు.

English summary
former Defence Minister Nirmala Sitharaman is the new first women Finance Minister in Modi Cabinet 2.0, while the Defence Ministry has been given to former Home Minister Rajnath Singh. She has also been given the charge of the Ministry of Corporate Affairs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X