వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడ్జెట్ సెషన్ : మన్మోహన్ సింగ్‌తో నిర్మల సీతారామన్ భేటీ, పద్దుకు ముందు భేటీతో ప్రాధాన్యం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టాక పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది. ఆయా విభాగాల నుంచి కేటాయింపులకు సంబంధించి వివరాలు తీసుకొని .. పద్దును రూపకల్పన చేశారు. ఇప్పటికే హల్వా తయారు చేసి బడ్జెట్ ప్రతుల ప్రింటింగ్ కూడా ప్రారంభమైంది. వచ్చే నెల 5న బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

సలహాలు .. సూచనలు ...
బడ్జెట్ ప్రవేశపెట్టే కొద్దిరోజుల ముందు ఆమె మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్‌తో సమావేశమయ్యారు. మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నిర్మలా ..ఇవాళ ఢిల్లీలో మన్మోహన్‌తో భేటీ అయ్యారు. 1991లో పీవీ నరసింహరావు ప్రభుత్వలో మన్మోహన్ సింగ్ ఆర్థికమంత్రిగా పనిచేశారు. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే రూపాయి విలువ పడిపోకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి .. మన్మోహన్ సింగ్‌తో నిర్మలా చర్చించినట్టు తెలిసింది.

Nirmala Sitharaman Meets Manmohan Singh Days Before Her First Budget

సభకు దూరంగా ...
గత 30 ఏళ్ల నుంచి మన్మోహన్ సింగ్ పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్నారు. కానీ ఈసారి అతని రాజ్యసభ పదవీకాలం ముగియడంతో సభకు రాలేకపోతున్నారు. దీంతో 1986 తర్వాత తొలిసారి బడ్జెట్ ప్రసంగానికి దూరం కానున్నారు. ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ .. రెండుసార్లు ప్రధాని పదవీ కూడా చేపట్టిన సంగతి తెలిసిందే. దేశ తొలి పూర్తిస్థాయిలో ఆర్థికమంత్రిగా నిర్మలా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఇందిరాగాంధీ ఆర్థికమంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ ప్రధాని పదవీతోపాటు ఆర్థికమంత్రి పోర్ట్ పోలియో నిర్వహించారు.

English summary
Finance Minister Nirmala Sitharaman met former prime minister Manmohan Singh at his home in Delhi today. The meeting comes days before Ms Sitharaman presents the union budget in parliament on July 5. It will be her first budget after taking charge as Finance Minister last month following a landslide win in the national election for Prime Minister Narendra Modi. Dr Manmohan Singh is widely recognised for the economic reforms which he announced in 1991 when he was the finance minister in the Narasimha Rao government. Sources in the Finance Ministry said Ms Sitharaman's visit was a courtesy call. This is her first meeting with Mr Singh after taking charge of the ministry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X