వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్థిక మందగమనం: మన్మోహన్ వ్యాఖ్యలపై స్పందించని నిర్మలా సీతారామన్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జీడీపీ గణాంకాల పతనం, ఆర్థిక మందగమనంతో ఉద్యోగాలు పోతున్నాయనే మీడియా అడిగిన ప్రశ్నలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేరుగా మాధానమివ్వకుండా మిగితా అంశాలపై స్పందించారు. ప్రభుత్వం అన్ని రంగాలను సంప్రదిస్తోంది. తగిన చర్యలు తీసుకుంటోంది. ఆగస్టు 23, గత శుక్రవారం పలు కీలక ప్రకటనలు చేశామని ఆమె చెప్పారు.

తప్పుడు విధానాల వల్లే ఆర్థిక మందగమనం: మోడీ ప్రభుత్వాన్ని ఏకేసిన మన్మోహన్తప్పుడు విధానాల వల్లే ఆర్థిక మందగమనం: మోడీ ప్రభుత్వాన్ని ఏకేసిన మన్మోహన్

భారీ స్థాయిలో జాతీయ బ్యాంకుల విలీనం ఉంటుందని, రాష్ట్రాల చేతిలో ఉన్న 27 బ్యాంకులను విలీనం చేసి 12కు తగ్గిస్తామని గత శుక్రవారం ప్రకటించారు. కాగా, ఆదివారం ఉదయం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. అవకాశాలను అందిపుచ్చుకోకపోవడం, తప్పుడు విధానాల వల్లే దేశ ఆర్థిక పరిస్థితి మందగమనంలో ఉందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం విఫలం కావడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు.

Nirmala Sitharaman refuses to answer questions on economic slowdown, Manmohan remark

అయితే, మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించేందుకు నిరాకరించారు. ఆయన తప్పుడు సమాచారం ఇస్తున్నారని అన్నారు. ఒక వేళ మీరు(మీడియా) చెప్పినట్లు మన్మోహన్ సింగ్ అలా అని ఉన్నట్లయితే ఆయన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుంటామన్నారు సీతారామన్. మన్మోహన్ ఏమన్నారో దాని గురించి తెలియదని, ఆయన చెప్పారు.. నేను విన్నాను అని తెలిపారు.

ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం వల్ల ఎవరి ఉద్యోగాలు పోవని, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బ్యాంకుల విలీనం కారణంగా ఏ బ్యాంకులు మూత పడవని ఆమె స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఏ బ్యాంకులనూ మూసివేయడం లేదు, ఉద్యోగులను తొలగించడమూ లేదని ఆమె తేల్చి చెప్పారు.

English summary
Finance Minister Nirmala Sitharaman addressed a press conference to talk about the growing concerns over the economic health.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X