వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ మాట అనడానికి మమతకు ఎంత ధైర్యం?: బెంగాల్ సీఎంపై కేంద్ర మంత్రి నిర్మల ఫైర్

|
Google Oneindia TeluguNews

Recommended Video

CAA 2019 : Nirmala Sitharaman angry Over Mamata Banerjee’s Referendum Remark || Oneindia Telugu

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోనని చెప్పడమే కాకుండా, ఈ అంశంపై ఐక్యరాజ్యసమితితో రిఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేసిన వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మమత తీరుపై ఘాటుగా స్పందించారు.

భారతీయ సంస్థలపై ఆమెకు నమ్మకం లేదా?
ఇండియాకు సంబంధించిన ఏ వ్యవహారంలోనైనా మూడో వ్యక్తి లేదా సంస్థ ప్రమేయాన్ని మనం ఏరోజూ సహించలేదు. అలాంటిది ఒక రాష్ట్రానికి సీఎం అయ్యుండి మమత.. ఐక్యరాజ్యసమతి జోక్యం కోరడం విడ్డూరంగా ఉందని, ఆమె ప్రకటనను ఖండిస్తున్నానని నిర్మల చెప్పారు. మమతకు భారతీయ సంస్థల పట్ల నమ్మకం, గౌరవం లేకే ఇలాంటి మాటలు జారుతున్నారని కేంద్ర మంత్రి మండిపడ్డారు.

nirmala Sitharaman slams Mamata banerjee for demanding UN referendum in CAA issue

గురువారం కోల్ కతాలో జరిగిన సీఏఏ వ్యతిరే నిరసన ర్యాలీలో టీఎంసీ చీఫ్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. సీఏఏ, ఎన్ఆర్సీ చట్టం అంశాల్లో యూఎన్ చేతగానీ, మరే ఇతర హక్కుల సంస్థతోగానీ రిఫరెండం నిర్వహించే దమ్ము కేంద్రానికి ఉందా అని సవాలు చేసిన సంగతి తెలిసిందే. సీఏఏకు వ్యతిరేకంగా శుక్రవారం కూడా వెస్ట్ బెంగాల్ లో చాలా చోట్ల నిరసనలు జరిగాయి.

English summary
Mamata has no faith in institutions of India alleges union minister nirmala Sitharaman
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X