వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంట్ భేటీకి ముహూర్తం ఫిక్స్: బడ్జెట్ ఎప్పుడంటే?: పేపర్ లెస్..నిర్మలమ్మ స్పెషాలిటీస్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ముహూర్తం కుదిరింది. గత ఏడాది ఆర్థిక సంవత్సరం మొత్తాన్నీ కరోనా వైరస్ స్తంభింపజేసిన ప్రస్తుత పరిస్థితుల్లో.. ఉభయ సభల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ప్రతిపాదనలపై అందరి దృష్టీ నిలిచింది. ఈ సారి బడ్జెట్‌లో కరోనా వైరస్ సెస్ లేదా సర్‌ఛార్జ్‌ను విధించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో.. అదనపు వడ్డింపులు ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ధరల నియంత్రణ కోసం కేంద్రం ఎలాంటి చర్యలను తీసుకుందనే విషయం చర్చనీయాంశమౌతోంది.

29న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..

29న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..


పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 29వ తేదీన ప్రారంభం కాబోతోన్నాయి. రెండు దశల్లో కేంద్ర ప్రభుత్వం ఈ భేటీని నిర్వహించనుంది. తొలి విడతగా 29వ తేదీ నుంచి వచ్చేనెల 15వ తేదీ వరకు పార్లమెంట్‌ను సమావేశపరుస్తారు. రెండో దశలో మార్చి 8 నుంచి నెలరోజుల పాటు అంటే ఏప్రిల్ 8వ తేదీ వరకు ఈ భేటీ కొనసాగుతుంది. తొలి విడతలో 35 సార్లు, మలి దశలో 24 సార్లు పార్లమెంట్ సమావేశమౌతుంది. 17వ లోక్‌సభ అయిదో సెషన్ ఇది. 29న ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు.

 ఫిబ్రవరి 1న

ఫిబ్రవరి 1న

ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. లోక్‌సభలో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెడతారు. ఈ సారి కొన్ని ప్రత్యేకతలు బడ్జెట్ సమావేశాల్లో కనిపించబోతోన్నాయి. పేపర్ లెస్ బడ్జెట్‌ను ఆమె ప్రవేశపెట్టబోతోన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కాగితం రహితంగా బడ్జెట్ ప్రతిపాదనలు సభ్యుల చేతికి అందబోతోన్నాయి. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మాత్రమే బడ్జెట్ గురించి ఆమె వివరిస్తారు.

నో ప్రింటింగ్..

నో ప్రింటింగ్..

1947 న‌వంబ‌ర్ 26 తరువాత కాపీలు లేకుండా బడ్జెట్‌ ప్రతిపాదనలను ప్రవేశపెట్టబోతోండటం ఇదే తొలిసారి. నిజానికి- బడ్జెట్ ప్రతిపాదనలను తయారు చేసే సమయంలో ఆర్థికమంత్రిత్వ శాఖకు చెందిన ఉద్యోగులు, అధికారులు అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లడం, హల్వా వండటం ఆనవాయితీగా వస్తోంది. కరోనా వైరస్ వల్ల ఈ సంప్రదాయానికి కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. హల్వా వంటకం ఉండకపోవచ్చని తెలుస్తోంది. డిజిట‌ల్ రూపంలో బ‌డ్జెట్ ప్ర‌తులను లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు అందజేస్తారు.

సెస్ లేదా సర్‌ఛార్జ్ ఖాయమేనా?

సెస్ లేదా సర్‌ఛార్జ్ ఖాయమేనా?

కరోనా వైరస్ మిగిల్చిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి వచ్చే బడ్జెట్‌లో కరోనా సెస్ లేదా సర్‌ఛార్జ్‌ను విధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా కొన్ని వరుస భేటీలను కూడా నిర్వహించినట్లు సమాచారం. సెస్ రూపం ఎలా ఉండాలి? ఎంత శాతాన్ని అమల్లోకి తీసుకుని రావాలి? ఏఏ వర్గాలకు చెందిన ప్రజలకు దీన్ని వడ్డించాలనే విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోన్న చర్చలు ఓ కొలిక్కి వచ్చిందని అంటున్నారు. 2021-2022 ఆర్థిక సంవత్సరానికి గాను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ప్రతిపాదనల్లో వాటిని చేర్చుతారని చెబుతున్నారు.

English summary
The Budget session of Parliament will commence from January 29, with Union Finance Minister Nirmala Sitharaman set to present the Union Budget on February 1. The session will be held in two parts from January 29 to February 15 and March 8 to April 8.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X