వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపు బీజేపీ మేనిఫెస్టో రిలీజ్: నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా.. ఇవే కీలకాంశాలు..

|
Google Oneindia TeluguNews

బీహర్ ఎన్నికలు రంజు మీదున్నాయి. మరోసారి పాగా వేయాలని ఎన్డీఏ కూటమి భావిస్తోంది. ఎలాగైనా చెక్ పెట్టాలని తేజస్వి యాదవ్ అనుకొంటున్నారు. ఏ చిన్న అవకాశాన్ని కూడా చిరాగ్ పాశ్వాన్ వదలుకోవడం లేదు. అయితే తమ కూటమి అధికారంలోకి వస్తే అంటూ బీజేపీ క్యాంపెయిన్ చేస్తోంది. ఈ మేరకు మేనిఫెస్టోను రేపు (గురువారం) విడుదల చేయనుంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు.

కశ్మీర్ యువతులు, ఇద్దరు బీహర్ యువకులు.. పెళ్లిచేసుకున్నారు.. కట్ చేస్తే పోలీసు స్టేషన్‌లో....కశ్మీర్ యువతులు, ఇద్దరు బీహర్ యువకులు.. పెళ్లిచేసుకున్నారు.. కట్ చేస్తే పోలీసు స్టేషన్‌లో....

గురువారం పాట్నాలో నిర్మలా సీతారామన్ మేనిఫెస్టో విడుదల చేస్తారు. ఇందులో ఆత్మనిర్భర్ భారత్ ముఖ్యాంశంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రం అన్నీ విభాగాల్లో అభివృద్ధి సాధిస్తోందని.. దీంతో ప్రజలు స్వాలంబన పొందుతారని బీజేపీ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీ ప్రేరణతో స్వాలంభన చేయడం ప్రారంభించామని తెలిపారు.

Nirmala Sitharaman to release BJP’s manifesto tomorrow

ఆత్మనిర్భర్ భారత్‌తో బీహర్‌లో పారిశ్రామీకరణకు మార్గం సుగమం అవుతోందని అభిప్రాయపడ్డారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు భారీగా ప్రారంభమవుతాయని తెలిపారు. దీంతో బీహరీలు ఉద్యోగం కోసం ఇతర ప్రాంతాలకు కాదు.. సొంత రాష్ట్రంలోనే పనిచేస్తారని అభిప్రాయపడ్డారు.

స్వాలంభనతోపాటు వ్యవసాయం రంగం కూడా మరో ముఖ్యమైన అంశంగా మేనిఫెస్టోలో ఉండబోతుంది. బీహర్‌కు వ్యవసాయ రంగం వెన్నెముక లాంటిది.. అందుకోసం అగ్రికల్చర్ కూడా మేనిఫెస్టోలో ప్రయారిటీ ఇవ్వనున్నారు. దీంతోపాటు విద్య కూడా మరో కీలక అంశం కానుంది. ప్రాథమిక విద్య, ఉన్నత విద్యకు ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది. కొత్త విద్యావిధానం ద్వారా మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మారబోతుందని ఆ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు.

ఈ నెల 28వ తేదీన ఫస్ట్ ఫేజీ బీహార్ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 7వ తేదీ వరకు మూడు విడతలు ఎన్నికలు జరగుతాయి. 10వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడుతారు.

English summary
Bharatiya Janata Party will on Thursday release its election manifesto for the Bihar Assembly polls. Finance minister Nirmala Sitharanan will release the manifesto in Patna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X