వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వేలకు 50 లక్షల కోట్లు... ప్రైవేటు దిశగా అడుగులు...

|
Google Oneindia TeluguNews

గత కొద్దిరోజులుగా రైల్వేల ప్రవైటికరణ అంశాన్ని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్థావించారు. రానున్న పది సంవత్సరాల్లో రైల్వేల అభివృద్ది, మౌలిక వసతుల కల్పనకు గాను సుమారు రూ 50 లక్షల కోట్లు అవసరమవుతామని ఆమే ప్రకటించారు. ఇందుకోసం ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించనున్నట్టు ప్రకటించారు. 2018 నుండి 2030 లోగా రైల్వేల అభివృద్దికి ఈ నిధులు అవసరమవుతాయని తెలిపారు.

ఎక్కువ సంపాదించు, ఎక్కువ పన్ను కట్టు,, ఇదే నిర్మలా తారకమంత్రం ఎక్కువ సంపాదించు, ఎక్కువ పన్ను కట్టు,, ఇదే నిర్మలా తారకమంత్రం

రైల్వే ఆధునికరణకు ప్రైవేటీకరణ అవసరం

రైల్వే ఆధునికరణకు ప్రైవేటీకరణ అవసరం

రైల్వేలు ఏర్పడినన 1853 నుండి కూడ రైల్వేలు ప్రభుత్వ ఆధినంలో నడుస్తున్నాయి.. గత కోద్ది రోజులుగా రైల్వే రంగంలో కూడ ప్రవేటు పెట్టుబడులకు అనుమతినిస్తారనే వార్తలు వెలువడుతున్నా రాజకీయ కారణల వల్ల వాయిదా పడుతూ వస్తున్నాయి..దీంతో రైల్వేల్లో ఎఫ్‌డీఐ ప్రోత్సహంతో పీపీపీ విధానంలో కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆర్ధిక మంత్రి తేల్చి చెప్పారు. ముఖ్యంగా వేగ‌వంత‌మైన అభివృద్ధి, ప్ర‌యాణికుల ర‌వాణా వ్య‌వ‌స్థ కోసం రైల్వేల్లో ప్రైవేటు భాగ‌స్వామ్యాన్ని ప్రోత్స‌హించ‌నున్న‌ట్లు ఆమే తెలిపారు.

గత బడ్జెట్‌లోనే పీపీపీ పద్దతిని ప్రకటించిన మంత్రి

గత బడ్జెట్‌లోనే పీపీపీ పద్దతిని ప్రకటించిన మంత్రి


ఇందుకోసం గత సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన పీయుష్ గోయల్ సైతం రైల్వేల ఆధునికరణ, ప్యాసింజర్ ట్రెయిన్‌ల మెరుగుదల తోపాటు అభివృద్దికి పలు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే సరుకు రవాణ రంగంలో ఆదాయాన్ని అర్జిస్తున్న రైల్వేలు ప్యాసింజర్ ట్రెయిన్‌లలో నష్షాలను చవిచూస్తోంది. దీంతో వీటిని తగ్గించేందుకు ప్రైవేటు పెట్టుబడులు అవసరమవుతాయని ప్రకటించారు.

100 రోజుల ప్లాన్‌లో బాగంగా రైల్వేల కార్పోటికరణ

100 రోజుల ప్లాన్‌లో బాగంగా రైల్వేల కార్పోటికరణ

మరోవైపు రెండవసారి అధికారంలోకి వచ్చిన పీఎం నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం కంటే ముందే వంద రోజుల ప్రణాళికను రూపోందించాల్సిగా మోడీ ఆదేశించారు. దీంతో రానున్న వందరోజుల్లో చేపట్టాల్సిన పలు కార్యకర్యక్రమాల్లో 46 ప్రభుత్వ రంగ సంస్థలను మూసి వేయడం లేదా వాటిని అమ్మివేయాలనే నిర్ణయాలను నీతి ఆయోగ్ తీసుకుంది.ఇందులో భాగంగానే ప్రయాణికుల రైళ్లను కూడ ప్రైవేటు పరం చేయాలనే ప్రతిపాదనలను మోడీ ముందుంచింది నీతీ అయోగ్..

ప్రతిపక్షాల ఆందోళన

ప్రతిపక్షాల ఆందోళన

ఇక దీని ప్రకారమే ప్రభుత్వం రైల్వేలను ప్రవైటీకరణ చేసేందుకు పావులు కదుపుతుందని ప్రతి పక్ష పార్టీలు ప్రభుత్వంపై విమర్శలను ఎక్కుపెట్టాయి. ఈనేపథ్యంలోనే ప్రభుత్వ ఆస్థులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తుందని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది.ఇందులో భాగంగానే రాయ్‌బరేలీలోని రైల్వే ప్రాజెక్టులను కార్పోరేటికరణ చేసే ప్రతిపాదనను సోనియా గాంధీ వ్యతిరేకించింది. కాగా యూపిలో చేపడుతున్న చర్యలు ప్రవైటీకరణకు బాటలు వేస్తున్నాయని ఆమే విమర్శించారు.

English summary
Union minister Nirmala Sitharaman today proposed public-private partnerships in Railways to build more tracks and increase connectivity across the country.Railway infra would need an investment of 50 lakh crores between 2018 and 2030; PPP to be used to unleash faster development and delivery of passenger freight services says Union minister
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X