వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డోక్లాం: రక్షణ మంత్రి నిర్మలా పర్యటన, పోటోల కోసం సైనికులిలా..

By Narsimha
|
Google Oneindia TeluguNews

గ్యాంగ్‌టక్: భారత్, చైనా సరిహద్దుల్లో భద్రతను కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యవేక్షించారు. గోవా, సిక్కిం రాష్ట్రాల్లోని చైనా, ఇండియా సరిహద్దు ప్రాంతాల్లో నిర్మలా సీతారామన్ పర్యటించారు.

డోక్లాం, సిక్కింలో పర్యటిస్తున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్‌ ఆదివారం నాథూలా పాస్‌ను పరిశీలించారు. ఈ సమయంలో సరిహద్దు కంచె దగ్గర పహారా కాస్తున్న చైనా సైనికులు ఆమెను ఫొటోను తీసుకునేందుకు ప్రయత్నించారు.

Nirmala Sitharaman visits Nathu La on China border by road

ఇదే విషయాన్ని ఆమె ట్వీట్‌ ద్వారా తెలిపారు. సిక్కి, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కీలక ప్రాంతాలను ఆమె ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రోడ్డు మార్గం ద్వారా నాథూలా పాస్‌కు చేరుకున్నారు. అక్కడే ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

నాథూలా పాస్‌ చేరుకున్న రక్షణమంత్రికి ఈస్ట్రన్‌ కమాండెంట్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఆభయ్‌ కృష్ఱ గార్డ్‌ ఆనర్‌ ద్వారా గౌరవించారు. నాథూలా పాస్‌ నుంచి డోక్లాం, అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దును ఆమె ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అనంతరం సిక్కింలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయాన్ని పరిశీలించారు.

English summary
Defence minister Nirmala Sitharaman on Saturday visited Nathu La area on the China-India border and interacted with army and Indo-Tibetan Border Police (ITBP) officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X