వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్మలమ్మ మేజిక్: ట్యాక్స్ పేయర్లకు ఊరట: ఆర్డినెన్స్ స్థానంలో: కాస్సేపట్లో లోక్‌సభలో బిల్లు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ దేశాన్ని పట్టి పీడిస్తోంది. ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. వేలాదిమందికి ఉపాధిని దూరం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా మూడున్నర నెలల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధించాల్సి రావడం.. ప్రజలకు పిడుగుపాటులా మారింది. రోజువారీ ఆర్థిక కార్యకలాపాలు, వ్యాపార లావాదేవీలు స్తంభించిపోయాయి. లాక్‌డౌన్ వల్ల దినసరి వేతన కూలీలే కాదు.. వేతన జీవులు కూడా తీవ్రంగా ప్రభావితులయ్యారు. జీతాల మీద ఆధారపడి జీవించే వారు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు.

మోడీ పుట్టినరోజు: 2014 నుంచి జన్మదిన వేడుకలను ఎలా జరుపుకొంటున్నారో తెలుసా?మోడీ పుట్టినరోజు: 2014 నుంచి జన్మదిన వేడుకలను ఎలా జరుపుకొంటున్నారో తెలుసా?

ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వేతన జీవుల కోసం కొన్ని ఉపశమన చర్యలను ప్రకటించింది. పన్నుల చెల్లింపు గడువును పెంచడం, గడువు దాటిన తరువాత చెల్లించే పన్నులపై విధించాల్సిన పెనాల్టీ లేదా వడ్డీని మాఫీ చేయడం వంటి తక్షణ చర్యలను తీసుకుంది. దీనికోసం ఈ ఏడాది మార్చి 31వ తేదీన ప్రత్యేకంగా ఓ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. పన్ను చెల్లింపుదారులకు కల్పించేలా కేంద్రం వ్యవహరించింది.

Nirmala Sitharaman will introduce the Taxation and Other Laws Bill-2020 today in Lok Sabha

ఈ ఆర్డినెన్స్‌.. ఇక చట్టరూపం దాల్చబోతోంది. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. కాస్సేపట్లో లోక్‌సభలో ప్రవేశపెట్టబోతున్నారు. పన్నులు, ఇతర చట్టాలు (కొన్ని రకాల నియమాల్లో మినహాయింపులు, సవరణలు)-2020 పేరుతో ఈ బిల్లును రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. ఈ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే.. చట్టంగా మారుతుంది.

ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్డినెన్స్ స్థానంలో ఈ చట్టం అమల్లోకి వస్తుంది. పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించేలా, వారికి మరిన్ని ప్రయోజనాలను కల్పించేలా ఈ ముసాయిదాలో మార్పులు, చేర్పులు చేశారు. అలాగే- ఈ బిల్లు వల్ల పన్నులకు సంబంధించిన కొన్ని చట్టాల్లోనూ సవరణలను ప్రతిపాదించారు. కఠినతరమైన నిబంధనల నుంచి మినహాయింపులను కల్పించాలని నిర్ణయించారు. దీనితోపాటు- పీఎం కేర్స్‌కు విరాళాలను అందించే దాతలకూ కొన్ని రకాల పన్నుల నుంచి విముక్తి కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
Finance Minister Nirmala Sitharaman will introduce the Taxation and Other Laws (Relaxation and Amendment of Certain Provisions) Bill, 2020 that will replace the ordinance issued to provide compliance relief to taxpayers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X