వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్య కేసులో కీలకంగా మారిన..రూ.302లు: తల్లి మరణించిన రెండో రోజే విచారణకు న్యాయవాది

|
Google Oneindia TeluguNews

Recommended Video

Ayodhya Case : Clash Between Advocate Vikas Singh And Rajeev Dhavan During ayodhya Case In SC

న్యూఢిల్లీ: రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం కేసుపై సుప్రీంకోర్టు తుది విచారణ నిర్వహిస్తున్న నేపథ్యంలో.. తల్లి మరణించిన రెండో రోజే విధులకు హాజరయ్యారు ఓ సీనియర్ న్యాయవాది. ఆయనే సుశీల్ కుమార్ జైన్. అయోధ్య భూ వివాదం కేసులో కక్షిదారుగా ఉన్న నిర్మోహి అఖాడా తరఫున ఆయన ఈ కేసును వాదిస్తున్నారు. తల్లి మరణించిన బాధను దిగమింగుకుని ఆయన కేసు విచారణకు హాజరయ్యారు. కీలక పాయింట్లను ఆయన తన వాదనలను సందర్భంగా ప్రస్తావించారు. దీనికోసం ఆయన కొన్ని చారిత్రాత్మక పుస్తకాలను తన వెంట తీసుకొచ్చారు.

బాబర్ అయోధ్యకు వెళ్లిన ఆనవాళ్లు లేవు..
మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి బాబర్.. అయోధ్యను సందర్శించిన ఆనవాళ్లు చరిత్రలో ఎక్కడా లేవని వాదించారు. బాబర్ అయోధ్యను సందర్శించనప్పుడు ఇక ఆయన మసీదును ఎలా నిర్మించగలుగుతారని అన్నారు. బాబర్ అయోధ్యను సందర్శించారనడాన్ని నిరూపించడానికి అవసరమైన రాత ప్రతులు గానీ, ఇతర డాక్యుమెంట్లు ఏవీ లేవని చెప్పుకొచ్చారు. బాబ్రీ మసీదు నిర్వహణ కోసం బాబర్ తన హయాంలో 302 రూపాయలను విడుదల చేశారంటూ సున్నీ వక్ఫ్ బోర్డు తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారని, ఈ మొత్తాన్ని విడుదల చేశారడానికి కూడా సాక్ష్యాధారాల లేవని అన్నారు.

Nirmohi Akhara Advocate Sushil Kumar Jain attend the proceeding on Ayodhya Case, next day of his mother passes away

302 రూపాయల ఖర్చులపై సాక్ష్యాధారాలు ఉన్నాయా?
302 రూపాయలను విడుదల చేయడానికి సాక్ష్యంగా ఏవైనా డాక్యుమెంట్లు ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించారు. సాక్ష్యాధారాలు ఉన్నాయని అనుకున్నప్పటికీ.. వాటిని న్యాయస్థానం సమక్షంలో ఎందుకు ప్రవేశపెట్టలేకపోయారని నిలదీశారు. బాబ్రీ మసీదును మొఘల్ చక్రవర్తి బాబర్ నిర్మించారని సున్నీ వక్ఫ్ బోర్డు వాదిస్తోన్న విషయం తెలిసిందే. మసీదు నిర్వహణ కోసం ఆయన అప్పట్లోనే 302 రూపాయల విడుదల చేశారని వక్ఫ్ బోర్డు తరఫున వాదనలను వినిపిస్తోన్న రాజీవ్ ధవన్ సుప్రీంకోర్టులో వాదిస్తున్నారు. ఆయన వద్ద దీనికి సంబంధించిన డాక్యుమెంట్లేవీ లేవని సుశీల్ కుమార్ జైన్ చెప్పారు.

అయోధ్య రీవిజిటెడ్ పుస్తకంలో ప్రస్తావించిన కొన్ని అంశాలను న్యాయవాది వికాస్ సింగ్ చదవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో- సున్నీ వక్ఫ్ బోర్డు తరఫున కేసును వాదిస్తోన్న న్యాయవాది రాజీవ్ ధవన్ దాన్ని లాగేశారు. తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆ పుస్తకాన్ని చింపేయడానికి ప్రయత్నించారు. కొన్ని పేజీలను చింపేశారు కూడా. ఈ సందర్భంగా తోటి న్యాయవాదులు రాజీవ్ ధవన్ ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య తోపులాట చోటు చేసుకుంది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ సమక్షంలోనే ఈ హైడ్రామా నడిచింది. దీనితో ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

English summary
In Ayodhya Case on behalf of Nirmohi Akhara, Senior advocate Sushil Kumar Jain is attend the proceeding after second day of his mother passes away. Sunil Kumar Jain has argued that No documents to prove Babur released revenue for the maintenance of Babri Masjid, Not a single document was placed before the court to prove that Babur had released the revenue for Babri Masjid in Ayodhya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X