వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాసలీలల నిత్యానంద స్వామి మకాం మార్చనున్నారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు/చెన్నై: సినీ నటి రంజితతో రాసలీలలు, ఓ భక్తురాలి పైన అత్యాచారం చేశాడనే ఆరోపణల నేపథ్యంలో వివాదాస్పద నిత్యానంద స్వామీ తన విడిదిని మార్చాలని నిర్ణయించారు. కోర్టు ఆదేశాల మేరకు నిత్యానంద పురుషత్వ పరీక్షలకు హాజరైన విషయం తెలిసిందే.

ఈయన బెంగళూరు శివారులోని బిడది ఆశ్రమాన్ని వదిలి.. తమిళనాడులోని తిరువణ్ణామలైలోని తన ఆశ్రమ శాఖకు వెళ్లాలనుకొంటున్నారు. మంగళవారం బిడిది ఈ ప్రకటన చేసింది.

అయితే, తిరువణ్ణామలైలో ఆయన ఉండే అవకాశముంటుందా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. అక్కడి మదురై ఆధీన పీఠం కమిటీ, తిరుపనందల్ ఆధీనం సహా పలు ఆధీన పీఠాలు నిత్యానందకు వ్యతిరేకంగా ఉన్నాయి. అయితే, అది తిరువణ్ణామలైలోనిది నిత్యానంద ఆశ్రమ శాఖే కావడం గమనార్హం.

స్వామి నిత్యానంద

స్వామి నిత్యానంద

కాగా, వివాదాస్పద స్వామి నిత్యానంద మీడియా నుంచి తప్పుకోవడంలో అత్యంత సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. నిత్యానంద లైంగిక సామర్థ్య పరీక్షలకు వెళ్తాడని సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి బిదాడిలోని ధ్యానపీఠం ఆశ్రమం రెండు ద్వారాల వద్ద కాపు కాస్తూ ఉండిపోయారు.

 స్వామి నిత్యానంద

స్వామి నిత్యానంద

నిత్యానందను పోలిన ఓ వ్యక్తి కాషాయ వస్త్రాలు ధరించి ముఖాన్ని చాటు చేసుకుని ప్రధాన ద్వారం గుండా వాహనంలో బయటకు వచ్చాడు. దాంతో నిత్యానంద బయటకు వచ్చాడని భావించి మీడియా ప్రతినిధులు ఆ వాహనాన్ని కొంత దూరం అనుసరించారు.

స్వామి నిత్యానంద

స్వామి నిత్యానంద

అయితే, ఆ వాహనం యూటర్న్ తీసుకుని మళ్లీ ఆశ్రమానికి చేరుకోవడంతో తమకు టోకరా ఇచ్చారని మీడియా ప్రతినిధులు గ్రహించారు.

స్వామి నిత్యానంద

స్వామి నిత్యానంద

అప్పటికి ఉదయం 7 గంటల 40 నిమిషాలు అయింది. అప్పటికే నిత్యానంద విక్టోరియా ఆస్పత్రికి చేరుకున్నట్లు మీడియా ప్రతినిధులకు సమాచారం అందింది. నిత్యానందకు లైంగిక సామర్థ్య పరీక్షలు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు సాగాయి.

 స్వామి నిత్యానంద

స్వామి నిత్యానంద

అయితే, నిత్యానంద మీడియాకు ఎదురు కావడానికి ఇష్టం లేక బయటకు కూడా రాలేదు. కొన్ని గంటల పాటు విశ్రాంతి తీసుకోవడానికి నిత్యానంద వైద్యులను అడిగాడు.

 స్వామి నిత్యానంద

స్వామి నిత్యానంద

నిత్యానంద శిష్యులు ఫలాలు, ఇతర తినుబండారాలను లోనికి తీసుకుని వెళ్లారు. చివరకు తనదైన నవ్వు మాయమైన స్థితిలో నిత్యానంద సాయంత్రం 5 గంటలకు బయటకు వచ్చాడు.

English summary
Swami Nithyananda ready to leave Bidadi Ashram and Shift his base to Tiruvannamalai in Tamilnadu. But, Who will welcome him, Madurai Adheenam Protection Committee, Thirupanandhal Adheenam, Dharmapuram and Thirupanandhal all Sahivate adheeenam are against Nithyananda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X