వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని రేసులో లేను...గంగానది శుద్ధీకరణ పూర్తికి మరో ఏడాది పడుతుంది: నితిన్ గడ్కరీ

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ప్రధాని రేసులో తాను లేనని మరోసారి స్పష్టం చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి బాటలో పయనిస్తోందని చెప్పారు. తాను ఆర్ఎస్ఎస్ కార్యకర్తనని చెప్పుకున్న నితిన్ గడ్కరీ... దేశానికి సేవ చేయడమే తన ప్రథమ కర్తవ్యమని అన్నారు. దేశం యావత్తు నరేంద్ర మోడీకి అండగా ఉందని ఆయన విజన్‌ను సాకారం చేసేదానిలో తాను ఒకడినని గడ్కరీ చెప్పారు.ఇక ప్రధానమంత్రి అనే ప్రశ్నకు తావులేదని వెల్లడించారు.

ఇక క్లీన్ గంగా ప్రాజెక్టుపై మాట్లాడిన నితిన్ గడ్కరీ... మోడీ ప్రభుత్వంలో గంగా నదిలోలో నీటి పారుదల పెరిగిందన్నారు.ఇప్పటి నుంచి మరో 13 నెలల్లో గంగా నది శుద్ధీకరణ పూర్తవుతుందని చెప్పారు. ఉద్యోగాలు ఎక్కడున్నాయని గతంలో తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో దానిపై వివరణ ఇచ్చారు గడ్కరీ. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని... కంప్యూటరీకరణ జరిగిన తర్వాత ఉద్యోగాలు తగ్గిపోయాయన్నది తన ఉద్దేశమని చెప్పారు. గతేడాది ఆగష్టు 2018లో ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఆ సమయంలో దేశంలో ఉద్యోగాలు లేవని ఉద్యోగానికి రిజర్వేషన్ గ్యారెంటీకాదనే వ్యాఖ్యలను గడ్కరీ చేశారు. ఒకవేళ రిజర్వేషన్లు ఇచ్చినా దేశంలో ఉద్యోగాల కరువు నడుస్తోందని వ్యాఖ్యానించారు.

Nitin Gadkari: Not in race for PM’s post; Ganga will be cleaner in 13 months

అంతేకాదు ఈ మధ్యకాలంలో తాను చేసిన అచ్చేదిన్ వ్యాఖ్యలపై కూడా గడ్కరీ వివరణ ఇచ్చారు. జనవరి 27న ఓ సందర్భంలో మాట్లాడుతూ రాజకీయ నాయకులు సాధ్యం కానీ హామీలు ఇచ్చినప్పుడు ప్రజలు వారిని అందలం ఎక్కిస్తారని అవి నేరవేర్చలేనప్పుడు మాత్రం అదే రాజకీయనాయకుడిపై దుమ్మెత్తి పోస్తారని అన్నారు. రాజకీయనాయకులు నెరవేర్చగలిగే హామీలు మాత్రమే ఇవ్వాలని , తను నెరవేర్చగలిగే హామీలను మాత్రమే ఇస్తానని ఒకవేళ హామీ ఇచ్చానంటే 100శాతం నెరవేరుస్తానని వెల్లడించారు. నాడు అచ్చేదిన్ తీసుకొస్తానని చెప్పిన ప్రధాని వ్యాఖ్యలను గడ్కరీ పరోక్షంగా టార్గెట్ చేసినట్లు నాడు వార్తలు వచ్చాయి. అచ్చేదిన వ్యాఖ్యలపై కూడా వివరణ ఇచ్చారు గడ్కరీ. నా భుజంపై నుంచి మరొకరిని ఎందుకు కాల్చాలనుకుంటారు..? నేను ఏదైనా చెప్పదలుచుకుంటే సూటిగా ఆ వ్యక్తితోనే చెబుతాను అని గడ్కరీ చెప్పారు. ఇది మీడియా తప్పుకూడా కాదని వ్యాఖ్యానించారు.

ఇక వివిధ రాజకీయ పార్టీల్లో కూడా తనకు మంచి స్నేహితులున్నారన్న గడ్కరీ.... వారు తమ పార్టీ సిద్ధాంతాలతో విబేధించి ఉండొచ్చు కానీ వ్యక్తిగతంగా తనకు అంతా మంచి స్నేహితులే ఉన్నారని గడ్కరీ చెప్పారు.

English summary
Union Minister of Road and Transport Nitin Gadkari Friday said he is not in the race for the post of Prime Minister as is being widely speculated and that the country was progressing well under the leadership and ideology of Prime Minister Narendra Modi’s able hands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X