వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంట్రాక్టర్లకు గడ్కరీ హెచ్చరిక: బుల్‌డోజర్‌ కింద మీరుంటారు జాగ్రత్త?

|
Google Oneindia TeluguNews

భోపాల్: అవినీతికి పాల్పడే కాంట్రాక్టర్లకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. అంతేకాదు, తేడా వస్తే.. బుల్‌డోజర్‌ కింద రాళ్లకు బదులుగా మీరుంటారని ఆయన హెచ్చరించడం గమనార్హం.స

శనివారం మధ్యప్రదేశ్ లో అసంఘటిత కార్మికులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'కాంట్రాక్టర్లు రహదారుల పనులు సక్రమంగా జరుగుతున్నాయో లేదో ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఒకవేళ కాంట్రాక్టర్లు నిధులు సరిగా వినియోగించకుండా, అవినీతికి పాల్పడితే బుల్ డోజర్‌ కింద నలిగిపోయేది రాళ్లు కాదు మీరు' అంటూ గడ్కరీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Nitin Gadkari warning to contractors: Will put you under bulldozers

తాను ఎట్టి పరిస్థితుల్లో అవినీతిని సహించేది లేదని స్పష్టం చేశారు. రోడ్లు వేయడానికి ఖర్చు పెడుతున్న సొమ్మంతా మీది కాదని, అది దేశంలోని పేద ప్రజలది అని గుర్తుచేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో రవాణా పురోగతి దూసుకెళ్తుందన్నారు.

English summary
The Union minister said there was no shortage of funds in the country, and added that he will not tolerate corruption. He said the money does not belong to contractors but “the poor of this country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X