• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాపం నితీశ్ కుమార్ -సీఎం పదవికి బీజేపీ ‘స్క్రిప్ట్’ -సంచలనాలు చూడబోతున్నాం: మనోజ్ ఝా

|

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బొటాబొటి మెజార్టీ(125 స్థానాలు) సాధించిన ఎన్డీఏ అధికారాన్ని నిలబెట్టుకుంది. తనకంటే తక్కువ సీట్లొచ్చినా, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ నే మళ్లీ ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ హైకమాండ్ ఇదివరకే ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం పాట్నాలో జరిగే ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో నితీశ్ ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. కానీ ఇది తాత్కాలికమేనని, బీహార్ సీఎం పోస్టును దక్కించుకునేందుకు బీజేపీకి సొంత స్క్రిప్ట్ ఉందని, అతి త్వరలోనే రాష్ట్రంలో సంచలనాలు చూడబోతున్నామని ఆర్జేడీ నేత, ఎంపీ మనోజ్ ఝా వ్యాఖ్యానించారు.

చిరంజీవికి తెలంగాణ ప్రభుత్వం షాక్ -క్వారంటైన్‌లో ఉండాల్సిందే -మెగాస్టార్ తొందరపడ్డారా?చిరంజీవికి తెలంగాణ ప్రభుత్వం షాక్ -క్వారంటైన్‌లో ఉండాల్సిందే -మెగాస్టార్ తొందరపడ్డారా?

నితీశ్‌కు అదొక్కటే ఆప్షన్..

నితీశ్‌కు అదొక్కటే ఆప్షన్..

మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపొందింది. అయితే, 74 సీట్లతో బీజేపీ సీనియర్ భాగస్వామిగా అవతరించగా, 43 సీట్లతో జేడీయూ జూనియర్ స్థాయికి దిగజారింది. సర్కారు ఏర్పాటు చేయడానికి ముందే.. నితీశ్ కలల పథకమైన ‘మద్యనిషేధం'ను తొలగించాల్సిందిగా బీజేపీ అభ్యర్థించింది. తద్వారా రాబోయే ఐదేళ్లు నితీశ్ నిర్ణయాలపై తమదైన ‘ఒత్తిడి' తప్పదనే సంకేతాలను బీజేపీ వెలువరించింది. ఈ క్రమంలో.. నితీశ్.. మళ్లీ ఆర్జేడీతో కలిసిపోతారా? అనే చర్చ కూడా జరుగుతోంది. కానీ ఆర్జేడీ మాత్రం నితీశ్ ను మళ్లీ చేర్చుకునే ప్రసక్తేలేదని కుండబద్దలు కొట్టింది. బీజేపీతో కలిసుండటం తప్ప నితీశ్ కు మరో ఆప్షన్ లేదని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా అన్నారు.

సీఎం పోస్టు బీజేపీ కల..

సీఎం పోస్టు బీజేపీ కల..

‘‘పాపం నితీశ్ కుమార్ 43 సీట్లతో ముఖ్యమంత్రి అయిపోదామని కలలు కంటున్నారు. బహుశా తాత్కాలికంగానైనా ఆయన కల నెరవేరొచ్చు. కానీ అదే పదవి కోసం బీజేపీ 30 ఏళ్లుగా కలలు కంటోంది. దాన్ని ఎలా సాధించాలో కమలనాథులకంటూ ప్రత్యేకమైన స్క్రిప్టు కూడా ఉంది. అతి త్వరలోనే బీహార్ అధికార పక్షంలో అనూహ్య మార్పులు జరగబోవడం మనమంతా చూడబోతున్నాం. అంతేకాదు..

కరోనా విలయం: భారత్ కొత్త రికార్డు -కేంద్రం తాజా లెక్కలివి -వ్యాక్సిన్ కంటే ముందే హెర్డ్‌ ఇమ్యూనిటీకరోనా విలయం: భారత్ కొత్త రికార్డు -కేంద్రం తాజా లెక్కలివి -వ్యాక్సిన్ కంటే ముందే హెర్డ్‌ ఇమ్యూనిటీ

 సర్కారు కూలడం ఖాయం..

సర్కారు కూలడం ఖాయం..

గతంలో ఎన్డీఏకు చెప్పుకోదగిన మెజార్టీ ఉండేది. కూటమిలో సీనియర్ పార్టీకి అధినేతగా నితీశ్ తనవైన నిర్ణయాలు తీసుకునే వీలుండేది. కానీ ఈసారి ఎన్నికల్లో జనం మహాకూటమివైపు నిలిచారు. అతి తక్కువ మెజార్టీతో ఎన్డీఏ అధికారాన్ని నిలబెట్టుకుంది. జాగరూకులైన బీహారీలు తమ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈసారి ప్రభుత్వాన్ని నడపడం కచ్చితంగా కత్తిమీద సాము లాంటిదే. ఎన్డీఏ సాధించిన అరకొర మెజార్టీ కలకాలం ఉంటుందని అనుకోవడానికి వీలులేదు. పార్టీల మధ్య పొరపొచ్చలతో ఏరోజైనా కూలిపోవచ్చు'' అని మనోజ్ ఝా వ్యాఖ్యానించారు.

నితీశ్ రాకెట్ సైన్స్..

నితీశ్ రాకెట్ సైన్స్..

కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో కొనసాగుతూ, బీహార్ లో మాత్రం ఎన్డీఏకు విడిగా, కేవలం జేడీయూపైనే అభ్యర్థులను నిలిపిన ఎల్జేపీ(చిరాగ్ పాశ్వాన్ పార్టీ).. నితీశ్ సీట్లకు గండి కొట్టడంలో సక్సెస్ అయింది. జేడీయూకు నష్టం కలిగించిన చిరాగ్ పాశ్వాన్ పై చర్యలు తీసుకోవాల్సింది బీజేపీనే అని నితీశ్ తన తొలి ప్రెస్ మీట్ లో అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత మనోజ్ ఝా స్పందిస్తూ.. ‘‘అవునుమరి, ఎన్డీఏకు నష్టం చేసిన ఎల్జేపీపై చర్యలు తీసుకోవాల్సింది బీజేపీనే కదా, అదేదో రాకెట్ సైన్స్ కనిపెట్టినట్లు దీన్నే నితీశ్ కొత్తగా చెప్పడమేంటి?'' అని ఝా ఎద్దేవా చేశారు. బీహార్ ఎన్నికల్లో 110 స్థనాలు సాధించిన మహాకూటమి.. ఎన్నికల్లో అక్రమాల వల్లే తాము గెలవలేకపోయామని ఆరోపించింది.

English summary
Ahead of nda meeting in Bihar, senior Rashtriya Janata Dal leader Manoj Jha said the fate of the leadership in the state will be decided by bjp jdu chief Nitish Kumar has no option but to comply. "BJP has the 'script' to that dream. Just wait and watch what all will unfold in Bihar" Jha told.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X