వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నితీశే సీఎం: ఏకగ్రీవంగా ఎంచుకున్న బీహార్ ఎన్డీఏ ఎమ్మెల్యేలు -బీజేపీ బడా నేతల గైర్హాజరు

|
Google Oneindia TeluguNews

బీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఎంపికయ్యారు. ఆదివారం పాట్నాలో జరిగిన ఎన్డీఏ లెజిస్లేటివ్ సమావేశంలో.. నాలుగు పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా నితీశ్ పేరును సమర్థించారు. దీంతో ఎలాంటి నాటకీయత లేకుండా సీఎం సీటులో నితీశ్ చేరికకు మార్గం సుగగం అయింది. కీలకమైన ఈ సమావేశానికి ఒక్క రాజ్ నాథ్ సింగ్ తప్ప బీజేపీ బడా నేతలు గైర్హాజరుకావడం గమనార్హం.

Recommended Video

#Bihar : బీహార్ ముఖ్యమంత్రిగా మళ్లీ నితీశ్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక... రేపే ప్రమాణ స్వీకారం!

మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 125 సీట్లు సాధించి, అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే, గతంలో జూనియర్ భాగస్వామిగా ఉన్న బీజేపీ ఈసారి 74 సీట్లతో ఎన్డీఏలో సీనియర్ స్థానాన్ని ఆక్రమించగా, 43 సీట్లతో జేడీయూ జూనియర్ అయిపోయింది. సీట్ల సంఖ్యతో నిమిత్తం లేకుండా, తొలి నుంచీ తాము చెబుతున్నట్లుగానే నితీశ్ కుమార్ ను సీఎంగా కొనసాగిస్తామని బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. ఆ మేరకు స్పష్టమైన ఆదేశాలు రావడంతో..

పాపం నితీశ్ కుమార్ -సీఎం పదవికి బీజేపీ 'స్క్రిప్ట్' -సంచలనాలు చూడబోతున్నాం: మనోజ్ ఝాపాపం నితీశ్ కుమార్ -సీఎం పదవికి బీజేపీ 'స్క్రిప్ట్' -సంచలనాలు చూడబోతున్నాం: మనోజ్ ఝా

Nitish Kumar named as the next cm of bihar in NDA mlas meeting at Patna

పాట్నాలో ఆదివారం జరిగిన ఎన్డీఏ ఎమ్మెల్యే సమావేశంలో నితీశ్ ఎంపిక ప్రక్రియ సజావుగా సాగింది. వీలైతే ఆదివారమే ఎన్డీఏ నేతలంతా బీహార్ గవర్నర్ ఫగు చౌహాన్ ను కలిసి, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాల్సిందిగా ఎమ్మెల్యేల జాబితాతో వినతి పత్రం అందించే అవకాశాలున్నాయి. ఆదివారం నాటి పరిణామాలతో నితీశ్ బీహార్ సీఎంగా ఏడోసారి ప్రమాణం చేసేందుకు రంగం సిద్ధమైంది.

కరోనాకు మరో లెజెండ్ బలి -సౌమిత్ర ఛటర్జీ ఇకలేరు -ప్రమాదమని తెలిసినా సినిమాపై ప్రేమతో షూటింగ్‌ చేసి..కరోనాకు మరో లెజెండ్ బలి -సౌమిత్ర ఛటర్జీ ఇకలేరు -ప్రమాదమని తెలిసినా సినిమాపై ప్రేమతో షూటింగ్‌ చేసి..

బీహార్ సీఎంగా నితీశ్ కు ఇది నాలుగో టర్మ్ అవుతుంది. అయితే, మధ్యలో కూటములు మారడం, వివిధ కారణాల వల్ల ఆయన సీఎంగా ఆరుసార్లు ప్రమాణం చేశారు. 2000 సంవత్సరంలో తొలిసారి ముఖ్యమంత్రి అయిన నితీశ్ కుమార్ ఆ పదవిలో 8 రోజులున్నారు. 2005, 2010, 2015 ఎన్నికల్లో పూర్తి మెజార్టీతో పూర్తికాలం పదవిలో ఉన్నారు. 1977 ఎన్నికల్లో తొలిసారి నలంద జిల్లాలోని హర్నౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన నితీశ్... ఆ తర్వాత 1985లో మరోసారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తర్వాతి కాలంలో శాసనమండలి సభ్యుడిగానే కొనసాగుతూ ఎన్నికల్లో పోటీచేయని ఆయన తాజాగా ఏడోసారి సీఎంగా ప్రమాణం చేయనున్నారు.

English summary
Nitish Kumar elected as leader of National Democratic Alliance(NDA) legislature party, set to become Bihar's chief minister for 4th straight term. NDA mlas unanimously elected nitish in a meeting held on sunday in patna
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X