వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నితీశ్ వెంట రానీ బీజేపీ ఓటర్లు.. 2010తో పోలిస్తే సగానికి తగ్గిన శాతం.. కారణాలివే..

|
Google Oneindia TeluguNews

బీహర్ అసెంబ్లీ ఎన్నికల వేళ లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ బీహర్ ఓపినీయన్ పోల్ సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. నితీశ్‌పై ప్రజాధరణ తగ్గినా.. ఆయనే ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ జైలులో ఉండటం.. పాశ్వాన్ మృతితో బీహరీలు నితీశ్‌కే మొగ్గుచూపుతున్నారు.

ప్రభావం చూపనుందా..?

ప్రభావం చూపనుందా..?

చిరాగ్ పాశ్వాన్‌ను ఒంటరిగా బరిలోకి దిగాలని బీజేపీ ప్రతిపాదించిందని అంతా అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఎల్జేపీతో తమకు సంబంధం లేదని బీజేపీ అగ్రనేతలు చెప్పాల్సి వచ్చింది. దీంతో ఆ రెండు పార్టీల లోపాయికారీ ఒప్పందం ఓట్లరూపంలో ఎలా ప్రభావం చూపనుంది.

51 శాతానికి తగ్గింది

51 శాతానికి తగ్గింది

ఇదివరకు బీజేపీ అనుకూల ఓటర్లు నితీశ్ కుమార్‌కు మద్దతు తెలిపారు. 2010లో 91 శాతం మంది ఓటేశారు. బీహర్ సీఎంగా అంగీకరించారు. అయితే 2020 నాటికి ఆ సంఖ్య 55 శాతానికి తగ్గింది. దీంతోపాటు మరోసారి నితీశ్ కుమార్‌కు అవకాశం ఇస్తారా అంటే 31 శాతం అవునని.. 26 శాతం ఇవ్వమని చెప్పారు. తమకు కొత్త నాయకుడు కావాలని 34 శాతం చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే 58 శాతం బీజేపీ ఓటర్లు మాత్రం నితీశ్ కుమార్ తమ రెండో ఛాన్స్ అని అభిప్రాయపడ్డారు.

 ఇవీ వైఫల్యాలు

ఇవీ వైఫల్యాలు

2015లో కూడా నితీశ్ కుమార్ ప్రజలతో మరింత మమేకమే అవకాశం ఇవ్వాలని కోరారు. ఆచరణలో మాత్రం విఫలమయ్యారనే చెప్పాలి. ముజఫర్ నగర్ షెల్టర్ హోం ఘటన, పాట్నా వరదలు, వలసకూలీల వెతలు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయని ఒపినీయన్ పోల్ నిర్వహకులు చెబుతున్నారు. ఇన్నీ జరుగుతోన్నా ఇప్పటికీ బీహర్‌లో పాపులర్ లీడర్ మాత్రం నితీశ్ కుమారే.. 2015లో నితీశ్ పాపులారిటీ 40 శాతం ఉండగా.. లాలూ కుటుంబం 9 శాతం ఉండేది. 2020 నాటికి కూడా నితీశ్ కుమార్ 31 శాతం కాగా.. లాలూ కుటుంబానికి 30 శాతం ఉంది.

నితీశ్ నాయకత్వంలోనే..

నితీశ్ నాయకత్వంలోనే..

అయినప్పటికీ ఎన్డీఏ నితీశ్ కుమార్‌పై విశ్వాసం ఉంచింది. ఆయన నాయకత్వంలోనే ఎన్నికలకు వెళుతోంది. నితీశ్ చేసిన అభివృద్ది పనులే తమ విజయానికి నాంది అవుతాయని ధీమాతో ఉంది. తమ కూటమికి 200కు పైగా సీట్లు వస్తాయనే ధీమాతో ఉంది. కానీ నితీశ్ కుమార్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది అని బీజేపీ ఎంపీ స్వపన్ దాస్ గుపతా తెలిపారు. గతంలో కంటే ప్రజాధరణ తగ్గిందన్నారు. కానీ కూటమి మాత్రం నితీశ్‌పై ఆధారపడిందని చెప్పారు.

 గెలిస్తే మాత్రం..

గెలిస్తే మాత్రం..

ఉద్యోగాల కల్పన, వలస కూలీల సమస్యలు తీర్చకపోవడం నితీశ్‌కు మైనస్‌గా మారిందని సీనియర్ జర్నలిస్ట్ జావేద్ అన్సారీ తెలిపారు. ఒకవేళ ఈ సారి కూడా నితీశ్ గెలిస్తే.. అది బీజేపీ, మోడీ పేరు వల్లే అవుతోందని తెలిపారు.

English summary
Lokniti-CSDS Bihar Opinion Poll: From 2010, where 91 per cent of BJP voters supported Nitish Kumar as the CM of Bihar, the number has now fallen to 55 per cent in 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X