వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నితీశ్ కుమార్ రక్త నమూనా సేకరణ, ఆదివారం రిపోర్ట్.. సింగ్‌తో వేదిక పంచుకోవడంతో టెస్ట్..

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. అయితే రాజకీయ నేతలు, అధికారుల సమావేశాల్లో ఒకరికీ పాజిటివ్ వచ్చినా అంతే సంగతులు. ఇలా శనివారం బీహర్ సీఎం నితీశ్ కుమార్ కూడా కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ తాత్కాలిక చైర్మన్ అవదేశ్ నారాయణ్ సింగ్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే అతనితో ఇటీవల ఒక వేదికపై నితీశ్ కుమార్ ఆశీనులయ్యారు. దీంతో అతనికి కరోనా భయం పట్టుకుంది. వెంటనే రక్తనమూనాలను ఇచ్చేశారు.

 Nitish Kumar Sends Swab Sample for Covid-19 Test..

పాట్నాలోని ఇందిరాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిబ్బంది నితీశ్ కుమార్ రక్తనమూనాలను సేకరించారు. నితీశ్‌తోపాటు మరో 15 మంది ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల నమూనాను కూడా సేకరించారు. దీనికి సంబంధించి ఫలితం ఆదివారం వచ్చే అవకాశం ఉంది.

సింగ్ కాదు అతని భార్య, ఇద్దరు కుమారులు, కోడలికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. పాట్నాలోని ఎయిమ్స్‌లో సింగ్ చేరారు. అతనితో పాజిటివ్ వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆస్పత్రిలో చేరారు. అయితే చిన్న కుమారుడు నిషాంత్ రంజ్, కోడలు ఖుష్బు మాత్రం ఇంటిలో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వారి పరీక్ష ఫలితాలు శనివారం ఉదయం వచ్చాయని సింగ్ పీఏ రాహుల్ కుమార్ తెలిపారు. శుక్రవారం సింగ్ సహా ఫ్యామిలీకి జ్వరం రావడంతో రక్త నమూనాలను సేకరించారు.

Recommended Video

Bihar Lightning : పిడుగుల వానతో ఏకంగా 83 మంది మృతి, పెను విషాదం...!! || Oneindia Telugu

రాష్ట్రంలో వైరస్ సోకిన సభ్యుడిలో సింగ్ ఐదోవారు. మంత్రి వినోద్ కముార్ సింగ్, అతని భార్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. బీజేపీ ఎమ్మెల్యే జిబేష్ కుమార్ మిశ్రా, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ శంకర్ సింగ్, ఆర్జేడీ ఎమ్మెల్యే షనావజ్ అలాంకు కరోనా వైరస్ సోకింది. ఆర్జేడీ సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ వైరస్ తగ్గడంతో ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

English summary
Bihar Chief Minister Nitish Kumar on Saturday sent his swab sample for COVID-19 test after he shared the dais with Legislative Council Acting Chairman Awadesh Narayan Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X