• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నితీశ్‌కే బీహరీల పట్టం: వరసగా నాలుగోసారి సీఎం, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆర్జేడీ..

|

బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయదుందుబి మోగించింది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం మహాగట్ బంధన్ విక్టరీ కొడుతుందని అంచనా వేశాయి. కానీ అంచనాలు తలకిందులు అయ్యాయి. బీహర్ అసెంబ్లీలో 243 సీట్లు ఉండగా.. మెజార్టీ మార్క్ 122.. కానీ ఎన్డీఏ కూటమి 125 సీట్లు సాధించాయి. అయితే జేడీయూ మాత్రం తక్కువ స్థానాల్లో గెలవడం విశేషం. అయినా సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తూ.. ఒప్పందం మేరకు నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవీ అప్పగించారు. బీహర్ ఎన్నికల ఫలితాలు ఈయర్ ఎండర్‌లో విశ్లేషిద్దాం. పదండి.

సీఎం రేసులో తేజస్వీ పేరు.. కానీ

సీఎం రేసులో తేజస్వీ పేరు.. కానీ

బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ హాట్ టాపిక్‌గా మారారు. సీఎం అభ్యర్థి రేసులో ఆయన పేరే వినిపించింది. అనుకున్నట్టుగానే ఆర్జేడీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. 75 సీట్లు సాధించి.. తేజస్విని హీరో చేసింది. కానీ కూటమి మాత్రం 110 సీట్ల వద్ద ఆగిపోయింది. అధికారానికి 12 సీట్ల దూరంలో నిలిచిపోయింది. కానీ ఈ సారి బీజేపీ 74 సీట్లు సాధించి.. సత్తా చాటింది. గతంలో కన్నా సీట్ల సంఖ్యను పెంచుకుంది. జేడీయూ మాత్రం కేవలం 43 సీట్లతో సరిపెట్టుకుంది. తక్కువ సీట్లు గెలవడంతో బీజేపీ అభ్యర్థికి సీఎం పదవీ ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ అంతకుముందు ఇచ్చిన హామీ మేరకు నితీశ్ సీఎం పదవీ చేపట్టారు. కానీ బీజేపీ నుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నారు.

కనిపించని కాంగ్రెస్ ప్రభ

కనిపించని కాంగ్రెస్ ప్రభ

ఇక కాంగ్రెస్ కేవల 19 సీట్లు, సీపీఐ ఎంల్ 12, హెచ్ఏఏం 4, ఎంఐఎం 5 సీట్లు, సీపీఎం 2, సీపీఐ 2 సీట్లను గెలుచుకుంది. ఎన్డీఏ 125 సీట్లు సాధించగా.. మహాగడ్ బందన్ 110 సీట్లను గెలచుకుంది. కరోనా వైరస్ తర్వాత తొలిసారి బీహర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. నితీశ్ కుమార్ వరసగా నాలుగోసారి సీఎం పదవీ చేపట్టారు. మొత్తంగా ఏడోసారి ముఖ్యమంత్రి పదవీ స్వీకరించారు. ప్రచారంలో భాగంగా తనకు ఇవే చివరి ఎన్నికలు అని చెప్పారు. కానీ దానిని పార్టీ శ్రేణులు ఖండించాయి. అంతా ప్రచారం చేసినా.. జేడీయూకు ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. ఎన్డీఏ కూటమి మెజార్టీ సాధించడంతో.. నితీశ్ కుమార్ పగ్గాలు చేపట్టారు.

  2020 Big Event : Namaste Trump హౌడీ మోడీ- నమస్తే ట్రంప్.. ఢిల్లీ అల్లర్ల సమయంలోనే ట్రంప్ పర్యటన !
  57 శాతం ఓటింగ్

  57 శాతం ఓటింగ్

  బీహర్‌లో 12 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. మూడు విడతల్లో పోలింగ్ జరిగింది. నవంబర్ 10వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టారు. 57 శాతం ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆర్జేడీ అధికారానికి దూరమై 15 ఏళ్లు కావడం, దాణా కుంభకోణం కేసులో లాలూ జైల్లో ఉండటంతో తేజస్వీ ఒంటరి పోరాటం చేశారు. ఆయన ప్రచారానికి ప్రజలు పోటెత్తినా.. ఆశించిన సీట్లు మాత్రం రాలేదు.

  English summary
  nitish kumar takes oath fourth time as a bihar chief minister but rjd win majority seats in the state.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X