వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిహార్ సీఎంగా నేడే నితీశ్ ప్రమాణ స్వీకారం... డిప్యూటీ సీఎం పదవిపై కొనసాగుతున్న సస్పెన్స్..?

|
Google Oneindia TeluguNews

బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ వరుసగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. సోమవారం(నవంబర్ 16) మధ్యాహ్నం 4.30గంటలకు నితీశ్ ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఆదివారం(నవంబర్ 15) పాట్నాలోని నితీశ్ అధికారిక నివాసంలో జరిగిన ఎన్డీయే నేతల సమావేశంలో... నితీశ్‌కే మళ్లీ బాధ్యతలు అప్పగించాలని అధికారికంగా నిర్ణయించారు. ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఆయన్ను ఎన్నుకున్నారు.

Recommended Video

#Bihar : బీహార్ ముఖ్యమంత్రిగా మళ్లీ నితీశ్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక... రేపే ప్రమాణ స్వీకారం!
జేడీయూ శాసనసభాపక్ష నేతగా...

జేడీయూ శాసనసభాపక్ష నేతగా...

ఎన్డీయే నేతలతో సమావేశానికి ముందు... జేడీయూ ఎమ్మెల్యేలు తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా నితీశ్ కుమార్‌ను ఎన్నుకున్నారు. అనంతరం మధ్యాహ్నం 12.30గంటలకు జరిగిన ఎన్డీయే నేతల సమావేశంలో బీజేపీ,జేడీయూ,హిందూస్తానీ అవామీ మోర్చా,వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా హాజరయ్యారు. బిహార్‌లో ప్రభుత్వ ఏర్పాటు,తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి...

ఇచ్చిన మాటకు కట్టుబడి...

ఎన్డీయే నేతల సమావేశం అనంతరం నితీశ్ కుమార్ నేరుగా గవర్నర్‌ను కలిసి... ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. నిజానికి ఈ ఎన్నికల్లో జేడీయూ 43 స్థానాలకే పరిమితమైనప్పటికీ...ఇచ్చిన మాట కట్టుబడి ఎన్డీయే మళ్లీ నితీశ్‌కే పగ్గాలు అప్పగించింది. ఇటీవలి బిహార్ ఎన్నికల్లో బీజేపీ 74 స్థానాలతో రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తంగా ఎన్డీయే కూటమి 125 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఆర్జేడీ 75 స్థానాలతో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించగా... ఆ పార్టీ నేత్రుత్వంలోని మహాకూటమి 109 స్థానాలకే పరిమితమైంది.

డిప్యూటీ సీఎం పదవిపై సస్పెన్స్..

డిప్యూటీ సీఎం పదవిపై సస్పెన్స్..

నితీశ్ ప్రమాణస్వీకారానికి మరికొద్ది గంటలే సమయం ఉండగా... ఇప్పటికీ డిప్యూటీ సీఎం పదవిపై మాత్రం స్పష్టత లేదు. నిన్నటిదాకా నితీశ్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా కొనసాగిన సుశీల్ కుమార్ మోదీని కేంద్రంలోకి తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో... కొత్త డిప్యూటీ సీఎం ఎవరా అన్న చర్చ జరుగుతోంది. బిహార్ అసెంబ్లీకి బీజేపీ శాసనసభా పక్ష నాయకునిగా తార్‌ కిశోర్‌ ప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో... బహుశా ఆయనకే డిప్యూటీ సీఎం పదవి కట్టబెడుతారా అన్న చర్చ జరుగుతోంది. అలాగే బెత్తాహ్ ఎమ్మెల్యే రేణు దేవిని కూడా డిప్యూటీ సీఎం పదవి వరించే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

English summary
The leaders of the National Democratic Alliance (NDA) on Sunday participated in a joint meeting, where Nitish Kumar was elected as the alliance’s leader in Bihar. Nitish Kumar will take oath as the chief minister of Bihar for a fourth consecutive term at 4:30 pm on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X