వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిహార్‌ కా బాద్షా: నాల్గవసారి ముఖ్యమంత్రిగా నితీష్ ప్రమాణ స్వీకారం

|
Google Oneindia TeluguNews

బిహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది. తదుపరి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాజధాని పాట్నాలోని నితీష్ కుమార్ నివాసంలో ఎన్డీఏ ఎమ్మెల్యేల ఉమ్మడి భేటీ సందర్భంగా ఆయనను సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు. ఈ సమావేశం ముగిసిన వెంటనే నితీష్ కుమార్ రాజ్‌భవన్‌కు బయలుదేరి వెళ్లారు. గవర్నర్ ఫగు చౌహాన్‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం తనకు ఉందని వివరించారు.

Nitish Kumar to swear in as Bihar CM for fourth time in a row live updates

ముఖ్యమంత్రిగా తన పేరును బలపరుస్తూ ఎమ్మెల్యేలు చేసిన సంతకాలతో కూడిన లేఖను ఆయనకు అందజేశారు. ఇక బీహార్ ముఖ్యమంత్రిగా వరుసగా నాల్గవ సారి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా బీజేపీ నేత తార్‌కిషోర్ ప్రసాద్ ఉంటారని సమాచారం. ఇక నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారంకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం

Newest First Oldest First
4:56 PM, 16 Nov

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జేడీయూ అభ్యర్థి అశోక్ కుమార్ చౌదరి
4:53 PM, 16 Nov

మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జేడీయూ అభ్యర్థి బిజేంద్ర ప్రసాద్ యాదవ్. 1990 నుంచి తాను పోటీ చేసిన సుపాల్ సీటు నుంచి ఎప్పుడూ ఓటమి చెందని నేత
4:49 PM, 16 Nov

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జేడీయూ ఎమ్మెల్యే విజయ్ కుమార్ చౌదరి.ఈయన గతంలో స్పీకర్‌గా కూడా పనిచేశారు
4:47 PM, 16 Nov

బిహార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేసిన తార్‌కిషోర్ ప్రసాద్ మరియు రేణూ దేవీ
4:37 PM, 16 Nov

బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం. నితీష్‌తో ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్ర గవర్నర్ ఫాగు చౌహాన్
4:30 PM, 16 Nov

రాజ్‌భవన్‌కు చేరుకున్న కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా
4:22 PM, 16 Nov

బిహార్‌లో సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా చేసిన ఘనత నితీష్ కుమార్‌కు దక్కింది
4:21 PM, 16 Nov

బీహార్ ముఖ్యమంత్రిగా ఏడవ సారి ప్రమాణ స్వీకారం చేయనున్న నితీష్ కుమార్
4:20 PM, 16 Nov

పాట్నాలోని బీజేపీ ఆఫీస్ నుంచి రాజ్‌భవన్‌కు చేరిన అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా
4:19 PM, 16 Nov

రాజ్ భవన్‌కు చేరుకున్న నితీష్ కుమార్
4:06 PM, 16 Nov

బీజేపీ నుంచి ఆరు మంత్రి బెర్తులు, మూడు బెర్తులు హెచ్ఏఎమ్, వీఐపీ పార్టీలకు ఖరారు. జేడీయూకు ఐదు బెర్తులు
3:58 PM, 16 Nov

బీహార్‌ ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకోవాలని కాంగ్రెస్‌కు పిలుపు ఇచ్చిన కార్తీ చిదంబరం
3:21 PM, 16 Nov

ప్రజా తీర్పును బీజేపీ దోపిడీ లూటీ చేయడంతోనే నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవుతున్నారు. అందుకే ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాకూడదని నిర్ణయించాం:బీహార్ ఆర్జేడీ అధ్యక్షుడు జగ్దానంద్ సింగ్
2:54 PM, 16 Nov

నితీష్ కుమార్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకానున్న రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
2:53 PM, 16 Nov

నితీష్ ప్రమాణస్వీకారంకు హాజరు కాకూడదని ఆర్జేడీ, కాంగ్రెస్ నిర్ణయం
2:21 PM, 16 Nov

నితీష్‌తో పాటు మరో 14 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం
2:20 PM, 16 Nov

నితీష్ ప్రమాణస్వీకారంకు హాజరుకానున్న అమిత్ షా
10:04 AM, 16 Nov

ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం: తార్ కిషోర్ ప్రసాద్
10:03 AM, 16 Nov

ఉప ముఖ్యమంత్రులుగా తార్ కిషోర్ ప్రసాద్, రేణుదేవి
9:48 AM, 16 Nov

మరికాసేపట్లో నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం

English summary
Nitish Kumar is all set to take Oath as CM of Bihar for the fourth time.This occasion will take place on Monday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X