వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భయంతో 144 రోజులు ఇల్లు కదలని సీఎం నితీశ్ - వలసదారుల్ని గాలికొదిలేశారు- తేజస్వీ నిప్పులు

|
Google Oneindia TeluguNews

''ఇటీవలి కరోనా విలయకాలంలో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వలస కూలీలదైతే అరిగోస. లాక్ డౌన్ సమయంలో దేశం నలుమూల నుంచి దాదాపు 32 మంది బీహారీ వలస కూలీలు పిల్లాపాపలతో నడుకుంటూ వచ్చారు. ప్రజలు అంతలా బాధపడినా ముఖ్యమంత్రికి మాత్రం చీమైనా కుట్టినట్లు లేదు. కరోనాకు భయపడి ఆయన 144 రోజులపాటు ఇంటి నుంచి బయటికి రాలేదు. ఇప్పటికీ కరోనా తీవ్రత తగ్గకున్నా.. కేవలం జనం ఓట్లు కావాలి కాబట్టే ఆయన బయటికొస్తున్నారు'' అని మండిపడ్డారు ఆర్జేడీ నేత, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్జేడీ- కాంగ్రెస్- లెఫ్ట్ పార్టీలు సంయుక్తంగా శుక్రవారం నవాడ జిల్లాలో బహిరంగ సభలు నిర్వహించాయి. వీటిలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, లెఫ్ట్ పార్టీల నేతలు మాట్లాడారు. మహాకూటమి సీఎం క్యాండిడేట్ తేజస్వీ.. పదునైన ప్రసంగాలతో పీఎం మోదీ, సీఎం నితీశ్ లపై విమర్శలు సంధించారు.

జగన్ చాటుకు వెళ్లి ప్రేమించాలి -హీరో మహేశ్‌బాబు ఫీలింగా? -పెయిడ్ గుట్టురట్టు: ఎంపీ రఘురామజగన్ చాటుకు వెళ్లి ప్రేమించాలి -హీరో మహేశ్‌బాబు ఫీలింగా? -పెయిడ్ గుట్టురట్టు: ఎంపీ రఘురామ

 నితీశ్ 15 ఏళ్లు దండగ..

నితీశ్ 15 ఏళ్లు దండగ..

బీహార్ కు గత 15 ఏళ్లుగా సీఎంగా కొనసాగుతోన్న నితీశ్ కుమార్ జనానికి ఏమీ చేయలేదని, పదిహేనేళ్లలో పట్టుమని పది ఉద్యోగాలైనా ఇవ్వలేదని, ఫ్యాక్టరీల ఏర్పాటు, ప్రజలకు ఆరోగ్య సౌకర్యాలు అందించడం సహా అన్ని రంగాల్లో విఫలమయ్యారని తేజస్వీ యాదవ్ విమర్శించారు. ‘‘మహాకూటమి అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం. అదెలా సాధ్యమవుతుందని బీజేపీ వాళ్లు మమ్మల్ని ఎద్దేవా చేశారు. కానీ నిన్నటి బీజేపీ మేనిఫెస్టోలో 19 లక్షల ఉద్యోగాలకు హామీ ఇచ్చారు. ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామంటూ చావుభయాన్ని అమ్మజూపే ప్రయత్నం చేశారు. ఆత్మాభిమానం కలిగిన బీహారీలు బీజేపీ, జేడీయూలను నమ్మరుగాక నమ్మరు''అని తేజస్వీ అన్నారు.

 డబుల్ ఇంజన్ స్పీడెంత?

డబుల్ ఇంజన్ స్పీడెంత?

శుక్రవారం నుంచే బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీపైనా ఆర్జేడీ నేత తేజస్వీ విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో బీహార్ కు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ ఎటు పోయిందో చెప్పాలని ప్రశ్నించారు. ఇటు బీహార్, అటు కేంద్రంలో అధికారంలో ఉంటూ ‘డబుల్ ఇంజన్' వేగంతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామన్న మోదీ-నితీశ్ ను బీహారీలను నిలువునా దగా చేశారని, వరదలు, కరోనా సమయంలో ప్రజల్ని పట్టించుకోలేదని తేజస్వీ తిట్టిపోశారు.

Recommended Video

Bihar Elections 2020 : Key Issues in Nitish Vs Tejashwi Row | NDA alliance VS Mahagathbandhan
 చైనా ఆక్రమణపై మోదీ అబద్ధాలు

చైనా ఆక్రమణపై మోదీ అబద్ధాలు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ మరోసారి సైనికుల పేరు చెప్పి ఓట్లు అడగటాన్ని తప్పుపట్టారు. చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయలో చోటుచేసుకున్న ఘర్షణలో బీహార్ రెజిమెంట్ సైనికుల చనిపోవడాన్ని ఎన్నికల ప్రచారంలో గుర్తు చేసిన కేంద్ర మంత్రులకు రాహుల్ కౌంటరిచ్చారు. చనిపోయిన జవాన్లపట్ల, దేశాన్ని కాపాడుతోన్న సైనికుల పట్ల అందరికీ గౌరవ భావం ఉందని, అయితే, చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకోలేదని అబద్ధం చెప్పడం ద్వారా ప్రధాని మోదీ మన జవాన్ల త్యాగాలను అవమానించారని రాహుల్ మండిపడ్డారు.

100ఏళ్ల తర్వాత ఏపీలో భూసర్వే -1.22లక్షల చ.కిమీ, 4500 టీమ్స్ - సీఎం జగన్ రివ్యూ -దేశంలో తొలిసారి100ఏళ్ల తర్వాత ఏపీలో భూసర్వే -1.22లక్షల చ.కిమీ, 4500 టీమ్స్ - సీఎం జగన్ రివ్యూ -దేశంలో తొలిసారి

English summary
RJD leader Tejashwi Yadav aimed at a series of jibes at Bihar Chief Minister Nitish Kumar during an election rally in the state's Nawada district today, criticising the JDU boss for staying put at home for more than four months because of the Covid threat and only coming out to ask for votes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X