వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్: ప్రమాణ స్వీకారం తేదీ..సమయం ఇదే

|
Google Oneindia TeluguNews

పాట్నా: బిహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది. తదుపరి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాజధాని పాట్నాలోని నితీష్ కుమార్ నివాసంలో ఎన్డీఏ ఎమ్మెల్యేల ఉమ్మడి భేటీ సందర్భంగా ఆయనను సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు. ఈ సమావేశం ముగిసిన వెంటనే నితీష్ కుమార్ రాజ్‌భవన్‌కు బయలుదేరి వెళ్లారు. గవర్నర్ ఫగు చౌహాన్‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం తనకు ఉందని వివరించారు.

ముఖ్యమంత్రిగా తన పేరును బలపరుస్తూ ఎమ్మెల్యేలు చేసిన సంతకాలతో కూడిన లేఖను ఆయనకు అందజేశారు. అనంతరం ఆయన రాజ్‌భవన్ వెలుపల విలేకరులతో మాట్లాడారు. సోమవారం మధ్యాహ్నం తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని వెల్లడించారు. కాగా సాయంత్రం 4:30 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించవచ్చని తెలుస్తోంది. ఈ మేరకు రాజ్‌భవన్ వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి. వేదిక ఎక్కడ అనేది ఇంకా ఖారారు కాలేదు.

Nitish Kumar will take Oath as Bihar CM on Monday afternoon

ఈ ఉదయం నితీస్ కుమార్ నివాసంలో జనతాదళ్ (యునైటెడ్)-భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన వికాస్ శీల్ ఇన్సాఫ్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తానీ ఆవామ్ మోర్చా శాసన సభ్యులు కూడా దీనికి హాజరయ్యారు. ఎన్డీఏ తరఫున రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీ సందర్భంగా- సభా పక్ష నేతగా రాజ్‌నాథ్ సింగ్.. నితీష్ కుమార్ పేరును ప్రతిపాదించగా.. జీతన్ రామ్ మాంఝీ బలపరిచారు. అనంతరం ఎమ్మెల్యేలందరూ ఆయనను ఎన్నుకున్నారు.

Recommended Video

Trump Supporters Against Presidential Elections Results అక్రమంగా అధ్యక్ష స్థానం Jo Biden కైవసం ?

ఈ మేరకు ఉమ్మడి ప్రకటనపై సంతకాలు చేశారు. ఈ ఉమ్మడి ప్రకటనపై సంతకాలు చేసిన వారిలో బీజేపీ-74, జేడీయూ-43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ముఖ్యమంత్రిగా నితీస్ కుమార్ నితీష్ కుమార్ పేరును బలపరుస్తూ హిందుస్తాన్ ఆవామీ మోర్చా-4, వికాస్ శీల్ ఇన్సాఫ్ పార్టీ-4 ఎమ్మెల్యేలు వేర్వేరుగా లేఖలను ఇచ్చారు. వాటిని తీసుకుని నితీష్ కుమార్ నేరుగా రాజ్‌భవన్ వెళ్లారు. గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఓ స్వతంత్ర అభ్యర్థి ఎన్డీఏకే మద్దతు పలికారు. ఎన్డీఏ ఉమ్మడి భేటీలో చోటు చేసుకున్న పరిణామాలు, చర్చకు వచ్చిన అంశాలను ఆయనకు వివరించారు. ముఖ్యమంత్రిగా తన పేరును బలపరుస్తూ చేసిన సంతకాలతో కూడిన లేఖను అందజేశారు.

English summary
Oath ceremony to be held tomorrow afternoon: JD(U) Chief Nitish Kumar after staking claim to form government. He meets Governor Phagu Chauhan at Raj Bhavan to stake claim to form the government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X