వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నితీశ్ సభలో 'లాలూ జిందాబాద్' నినాదాలు... ఆగ్రహంతో ఊగిపోయిన సీఎం...

|
Google Oneindia TeluguNews

ఓవైపు ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన దిగ్గజ నేత నితీశ్ కుమార్... మరోవైపు కేవలం ఒకసారి ఎమ్మెల్యేగా,రెండేళ్లు డిప్యూటీ సీఎంగా మాత్రమే పనిచేసిన యువ నేత తేజస్వి యాదవ్... ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న టగాఫ్ వార్‌లో అంతిమ విజయం ఎవరిని వరిస్తుందన్నది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే 10లక్షల ఉద్యోగాల హామీతో తేజస్వి యువతను పెద్ద ఎత్తున ఆకర్షిస్తుండటం నితీశ్‌కు మింగుడుపడటం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన ప్రతీ ఎన్నికల ర్యాలీలోనూ తేజస్వి ఉద్యోగాల హామీపై నితీశ్ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో బుధవారం(అక్టోబర్ 21) నితీశ్ పాల్గొన్న ఎన్నికల ర్యాలీలో 'లాలూ యాదవ్ జిందాబాద్' అన్న నినాదాలు ఆయనకు మరింత మంట పుట్టించాయి.

జేడీయూ అభ్యర్థి చంద్రికా రాయ్ తరుపున బుధవారం పార్సాలో నితీశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గతంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడైన చంద్రికా రాయ్ ఇటీవలే జేడీయూలో చేరిన సంగతి తెలిసిందే. తాజా ఎన్నికల ప్రచారంలో నితీశ్ ప్రసంగిస్తుండగా... కొంతమంది వ్యక్తులు ఒక్కసారిగా 'లాలూ యాదవ్ జిందాబాద్..' అంటూ నినాదాలు చేశారు. దీంతో నితీశ్‌ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. 'ఏం మాట్లాడుతున్నారు... ఆ నినాదాలు చేసినవాళ్లెవరో ఒకసారి చేతులు పైకి లేపండి.. ఏం చెత్త వాగుతున్నారు... మీరు మాకు ఓటేయకపోతే వేయకండి... అంతేగానీ ఇక్కడ న్యూసెన్స్ చేయవద్దు...' అంటూ నితీశ్ వారిని హెచ్చరించారు.

Nitish Loses His Cool as Slogans of Lalu Zindabad Raised at His Rally

మహాకూటమి అభ్యర్థి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ప్రచారానికి జనం నుంచి వస్తున్న స్పందన కూడా నితీశ్‌ను మరింత అసహనానికి గురిచేస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఏదేమైనా ఈ ఎన్నికల్లో నితీశ్ మునుపెన్నడూ లేనంత ప్రతికూలతను ఎదుర్కొంటున్నారు. ఇటీవల లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ వెల్లడించిన సర్వేలోనూ ఆయన పాపులారిటీ తగ్గినట్లుగా వెల్లడైంది. 2015లో నితీశ్ పాపులారిటీ 40శాతం,లాలూ ఫ్యామిలీ పాపులారిటీ 9శాతం ఉండగా... ఇప్పుడు నితీశ్ పాపులారిటీ 31శాతానికి పడిపోయిందని,అదే సమయంలో లాలూ పాపులారిటీ 30శాతానికి పెరిగిందని సర్వే వెల్లడించింది. ఒక రకంగా నితీశ్‌కు ఇది లాలూ ఫ్యామిలీ దెబ్బ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2015 ఎన్నికల సమయంలో దాదాపు 80శాతం మంది ప్రజలు నితీశ్ పాలన పట్ల సంతృప్తిని వ్యక్తం చేయగా.. ఇప్పుడది 50శాతానికి పడిపోయింది.

మొత్తంగా 31శాతం మంది బీహార్ ఓటర్లు నితీశ్‌కు మరోసారి సీఎంగా అవకాశం ఇవ్వాలని కోరుకుంటుండగా.. 26శాతం మంది ఆ ఛాన్స్ ఇవ్వవద్దన్న అభిప్రాయంతో ఉన్నారు. మరో 34శాతం మంది సీఎంగా కొత్త ముఖాన్ని చూడాలనుకుంటున్నారని ఆ సర్వే వెల్లడించింది.

English summary
Bihar Chief Minister Nitish Kumar, on Wednesday, lost his cool during an election rally in Parsa when a group of people began shouting slogans in favour of his long-time rival and RJD supremo Lalu Prasad Yadav. The JD(U) chief was in Parsa to address a rally in support of JD(U) candidate Chandrika Rai, an old aide of Yadav who crossed over to Kumar's party recently.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X