వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్ సీఎం పదవికి నితీశ్ రాజీనామా -గవర్నర్ ఆమోదం -ఆయన కలల పథకానికి బీజేపీ గండి

|
Google Oneindia TeluguNews

బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. శుక్రవారం సాయంత్రం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ఫగూ చౌహాన్ ను కలిసిన ఆయన తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. అదే సమయంలో అసెంబ్లీని రద్దు చేయాల్సిందిగా కోరారు. అందుకు సరేనన్న గవర్నర్.. నితీశ్ రాజీనామాకు ఆమోదం తెలిపి, అసెంబ్లీ రద్దు ప్రక్రియను ఆరంభించారు. దీంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సాంకేతిక అడ్డంకులన్నీ తొలగిపోయాయి.

డైవర్స్-డిస్టెన్స్: ట్రంప్‌ను కాదని సైనికుడితో మెలానియా -అసలేంటీ రచ్చ -చిట్టచివరి వేడుకడైవర్స్-డిస్టెన్స్: ట్రంప్‌ను కాదని సైనికుడితో మెలానియా -అసలేంటీ రచ్చ -చిట్టచివరి వేడుక

ఆదివారం కొత్త నేత ఎన్నిక

ఆదివారం కొత్త నేత ఎన్నిక

నితీశ్ కుమార్ తన రాజీనామా లేఖతో గవర్నర్ ను కలవడానికి ముందు.. అన్నే మార్గ్ లోని సీఎం అధికారిక నివాసంలో ఎన్డీఏ కీలక నేతలతో భేటీ అయ్యారు. బీజేపీ, జేడీయూ, హెచ్ఎంఏ, వీఐపీ పార్టీలకు చెందిన పలువురు నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆదివారం(నవంబర్ 15న) నాలుగు పార్టీల ఎమ్మెల్యేల ఉమ్మడి సమావేశం నిర్వహించి, అదే రోజు శాసనసభాపక్ష నేతగా నితీశ్ కుమార్ ను ఎన్నుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. తర్వాత అందరూ కలిసి రాజ్ భవన్ కు వెళ్లారు. ఆదివారం జరగబోయే పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది..

ఎన్డీఏ చెప్పినట్లు వింటా..

ఎన్డీఏ చెప్పినట్లు వింటా..

243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి తాజా ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 125 స్థానాలు సాధించి, అధికారం నిలబెట్టుకోవడం తెలిసిందే. ఎన్డీఏ కూటమిలో 74 సీట్లతో బీజేపీ సీనియర్ భాగస్వామిగా, 43 సీట్లతో జేడీయూ జూనియర్ భాగస్వామిగా మారడం తెలిసిందే. మాంఝీ(హెచ్ఏఎం)పార్టీకి 4, వీఐపీకి4 సీట్లు దక్కాయి. జేడీయూకు సీట్లు తక్కువొచ్చినా సీఎం నితీశే అని బీజేపీ నేతలు స్పష్టం చేయడంతో ఆయన ఏడోసారి ప్రమాణం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఫలితాల అనంతరం గురువారం తొలిసారి మీడియాతో మాట్లాడిన నితీశ్.. సీఎం పదవిని తాను కోరడంలేదని, ఎన్డీఏ నేతల నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటానని చెప్పారు. కాగా..

 నితీశ్ కలల పథకానికి మంగళం?

నితీశ్ కలల పథకానికి మంగళం?

ఇన్నాళ్లూ ఎన్డీఏలో సీనియర్ భాగస్వామిగా జేడీయూ ఉండటంతో సీఎం నితీశ్ తన నిర్ణయాలను కరాకండిగా అమలుచేశారు. కానీ ఇప్పుడు బీజేపీ సీనియర్ గా అవతరించడంతో నితీశ్ తన పద్దతులు, విధానాలు మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడినట్లు కనిపిస్తోంది. నితీశ్ ప్రతిష్టాత్మకంగా భావించిన మద్యనిషేధానికి ఇక ముగింపు పలకాలని బీజేపీ ఒత్తిడి చేస్తోంది. ఈ మేరకు బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే శుక్రవారం నితీశ్ కు స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. బీహార్ లో మద్య నిషేధం వల్ల సత్ఫలితాలు రాలేదని, పక్కరాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అక్రమంగా మద్యం సరఫరా అవుతుండటంతో రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతోందని, కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలోనైనా మద్యం నిషేధం ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని బీజేపీ ఎంపీ కోరారు.

Recommended Video

What Barack Obama Said About PM Modi In 2015 | Oneindia Telugu

దుబ్బాక ఫలితం జగన్‌కు పాఠం -సంచైత-సాయిరెడ్డి గురించి అక్కడిలా -వైసీపీ ఎంపీ వ్యాఖ్యలుదుబ్బాక ఫలితం జగన్‌కు పాఠం -సంచైత-సాయిరెడ్డి గురించి అక్కడిలా -వైసీపీ ఎంపీ వ్యాఖ్యలు

English summary
Decks were cleared on Friday for the formation of a new government in Bihar with Nitish Kumar, who is set to return as the chief minister, handing over to Governor Phagu Chauhan the resignation of his ministry and the recommendation to dissolve the state assembly, officials said. BJP MP asks Nitish to reconsider prohibition
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X