వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వలసకూలీలు, విద్యార్థుల సమస్యను మోడీ సర్కార్ ముందుంచిన బీహార్ సీఎం నితీష్..ఎందుకంటే

|
Google Oneindia TeluguNews

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లాక్ డౌన్ కు సంబంధించిన కేంద్రం నిర్దేశించిన నిబంధనలను కొన్ని రాష్ట్రాలు పాటించడం లేదని, వలస కూలీలు, ఒంటరిగా ఉన్న విద్యార్థులను తిరిగి తమ రాష్ట్రాలకు అనుమతించమని నిరసన వ్యక్తం చేశారు. అంతర్-రాష్ట్ర లేదా అంతర్-జిల్లా ప్రయాణాలకు అనుమతి లేదని కేంద్ర మార్గదర్శకాల నుండి స్పష్టమవుతోందని నితీష్ అభిప్రాయపడ్డారు. కానీ ఆయన తన మిత్రపక్షమైన బిజెపిపైనే నిప్పులు చెరిగారు. యూపీ ముఖ్యమంత్రి యోగి చేసిన పనితో రాజస్థాన్ లోని కోటా నుండి విద్యార్థులను తిరిగి తీసుకురావటంపై ఆయనకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుందని స్పష్టం చేశారు .

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారి బాధ్యత కేంద్రానిదే

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారి బాధ్యత కేంద్రానిదే

ప్రధానితో సిఎంల సమావేశం జరిగిన వెంటనే బీహార్ డిప్యూటీ సిఎం, బిజెపి నాయకుడు సుశీల్ కుమార్ మోడీ కోటా విద్యార్థుల సమస్య త్వరలో పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు.ఏదేమైనా, బీహార్ యొక్క నీటి వనరుల మంత్రి మరియు జనతాదళ్ (యునైటెడ్) యొక్క సన్నిహిత సహచరుడు సంజయ్ కుమార్ ఝా మాట్లాడుతూ బంతి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోర్టులో ఉందని చెప్పారు.

లాక్ డౌన్ నిబంధనలు ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా ఉండకూడదని పేర్కొన్న బీహార్ ప్రభుత్వం

లాక్ డౌన్ నిబంధనలు ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా ఉండకూడదని పేర్కొన్న బీహార్ ప్రభుత్వం

"విపత్తు నిర్వహణ చట్టం క్రింద ఏప్రిల్ 15 న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసినప్పుడు మరియు అంతర్-జిల్లా మరియు అంతర్-రాష్ట్ర రవాణాను నిషేధించినప్పుడు, నిబంధనలను సడలించడం మరియు అలాంటి రవాణాను అనుమతించడం కేంద్రంపై ఆధారపడి ఉంటుంది. వేర్వేరు రాష్ట్రాలకు వేర్వేరు నియమాలు ఉండకూడదు. విద్యార్థులను తిరిగి తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాము, కానీ రెండు నియమాలు ఉండకూడదు, " కాబట్టి ఈ విషయంపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి అని ఆయన అన్నారు.

విద్యార్థులకు, వలస కార్మికులకు వేర్వేరు నియమాలు పాటించలేం

విద్యార్థులకు, వలస కార్మికులకు వేర్వేరు నియమాలు పాటించలేం

ఢిల్లీ , ఒడిశా, పూణేలో వేలాది మంది విద్యార్థులు చిక్కుకుపోయారు... మేము కోటా విద్యార్థుల కోసం ఒక రూల్ మరియు పూణే విద్యార్థుల కోసం మరొకటి లేదా వలస కూలీల కోసం మరొక విధానం పాటించలేమని చెప్పారు . బీహార్ వెలుపల చిక్కుకున్న 25 లక్షల మంది ప్రజలు సిఎం సహాయ నిధి కింద సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు, మరియు మేము 15 లక్షల మందికి సహాయం అందించాము, కాని వారిని తిరిగి తీసుకురావడానికి కేంద్రం నిబంధనలను మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. బీహార్ యొక్క చంపారన్ నుండి బిజెపి ఎంపి సంజయ్ జైస్వాల్ కూడా హోంమంత్రి అమిత్ షా ఈ సమస్యను పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Recommended Video

Coronavirus : COVID-19 Cases Crossed 1,332 Mark In AP With 73 New Cases
కోటా నుండి యూపీ విద్యార్థులను బస్సుల్లో తీసుకురావటమే తాజా పరిస్థితికి కారణం

కోటా నుండి యూపీ విద్యార్థులను బస్సుల్లో తీసుకురావటమే తాజా పరిస్థితికి కారణం

యూపీ ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి మూడు వందల బస్సులను రాజస్థాన్ పంపించింది. ఇక కోటాలో మెడికల్, ఇంజినీరింగ్ కోచింగ్ సెంటర్లు చాలా ఉన్నాయి. లాక్‌డౌన్ తో యూపీకి చెందిన విద్యార్ధులు 9 వేల మంది కోటాలో చిక్కుకుపోయారు. వీరిని తరలించాలని నిర్ణయించిన ప్రభుత్వం బస్సులను ఏర్పాటు చేసింది.అయితే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉన్నప్పుడు ఇలా విద్యార్ధులను తరలించడంపై విపక్షాలు భగ్గుమన్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా యూపీ వైఖరిపై ఫైర్ అయ్యారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ పేద, వలస కూలీలను ఒకే విధంగా తరలించడానికి అనుమతించకపోవడం ఇది అన్యాయం అని అన్నారు. ఇప్పుడు ఈ విషయంపై ప్రధానినే ప్రశ్నించారు నితీష్ కుమార్ . కేంద్రం కోర్టులో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారి సమస్య పరిష్కారానికి ఉంచారు .

English summary
In Monday’s video conference with Prime Minister Narendra Modi, Bihar Chief Minister Nitish Kumar once again protested that some states are not following the rules laid down by the Centre related to the lockdown, and allowing migrant labourers and stranded students to return to their states.Nitish pointed out that it is clear from the central guidelines that no inter-state or inter-district travel is allowed. But he has been facing pressure from many quarters, including his ally BJP, to find a solution and bring back students from India’s coaching hub Kota in Rajasthan, as well as other places.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X