వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నో .. నో ... మీడియా ప్రతినిధుల ప్రశ్నలపై నితీశ్

|
Google Oneindia TeluguNews

పాట్నా : బీహర్‌లో మెదడు వాపు రక్కసి విజృంభిస్తోంది. ఇప్పటికే 121 మంది చిన్నారులు ఆసువులు బాశారు. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. కేంద్రం బృందం కూడా పరిశీలించింది. అయితే ఈ ఘటనపై బీహర్ సీఎం నితీశ్ కుమార్ మాత్రం నోరుమెదపలేదు. మీడియా ప్రతినిధుల నుంచి మెల్లగా జారుకున్నారు.

జారుకున్న నితీశ్ ..
ఎల్జేపీ అధినేత, కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వాన్ రాజ్యసభ అభ్యర్తిత్వానికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి బీహర్ సీఎం నితీశ్ కుమార్ హాజయ్యారు. దీంతో మీడియా ప్రతినిధులు కలుగజేసుకొని .. మెదడు వాపు వ్యాధిపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే వారు అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదు. మెల్లగా అక్కడినుంచి జారుకున్నారు. తాను చెప్పేది ఏమీ లేదని సంకేతాలు ఇచ్చినట్టు వెళ్లిపోయారు.

nitish wont answer on media about encephalitis

విమర్శల జాడివాన ...
ఇప్పటికీ కూడా రాష్ట్రంలో మెదడు వాపు వ్యాధితో చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సరైన వసతులు కల్పించడం లేదని బాధితులు మండిపడుతున్నారు. మరోవైపు ఇటీవల పర్యటించిన కేంద్ర బృందం కూడా .. ఆస్పత్రిలో సౌకర్యాల కల్పనపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేకాదు విపక్ష నేతలు కూడా నితీశ్ పైనే మండిపడుతున్నారు. చిన్నారులు పిట్టల్లా రాలుతున్న సరైన చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు. నిన్న ప్రధాని మోడీ ఇచ్చిన విందుకు ప్రతిపక్ష ఆర్జేడీ హాజరుకాలేదు. ఆ విందుకు చేసే వ్యయంతో చిన్నారులకు మందులు కొనివ్వచ్చు కదా అని ఆ పార్టీ నేత మిసాభారతి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

English summary
encephalitis is booming in Bihar. Already, 121 young children have been infected. The authorities are taking auxiliary measures. The center team also examined. However, Bihar CM Nitish Kumar has not been silent about the incident. Slowly slipped from the media representatives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X