తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Nivar Cyclone: తుపాను ఎఫెక్ట్, హైల్ప్ లైన్, వాట్సాప్, ఫోన్ నెంబర్లు, తెలుగు ప్రజలు జాగ్రత్త, చెన్నై

|
Google Oneindia TeluguNews

చెన్నై/ వేలూరు/ కోయంబత్తూర్: నివర్ తుపాను ముప్పుతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రజలు హడలిపోతున్నారు. బుధవారం నుంచి గురువారం వేకువ జామున వరకు నివర్ తుపాను దెబ్బకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈనెల 27వ తేదీ నాటికి తమిళనాడులో నివర్ తుపాన్ తీవ్రత పూర్తిగా తగ్గిపోయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల వైపు మళ్లుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ దెబ్బతో ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరిలో హైఅలర్ట్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు నివర్ తుపాను దెబ్బకు అప్రమత్తం అయ్యాయి. నివర్ తుపాను కారణంగా తమిళనాడు ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్లు, వాట్సాప్ నెంబర్ లు, టోల్ ఫ్రీ నెంబర్లు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. చెన్నైతో పాటు తమిళనాడులో నివాసం ఉంటున్న తెలుగు ప్రజలు ఈ హెల్ప్ లైన్ నెంబర్లలో సమాచారం తెలుసుకోవడానికి అవకాశం ఉంది.

Super: ప్రధానితోనే సాధ్యం, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు, కాంగ్రెస్, డీఎంకే అడ్రస్ గల్లంతు !Super: ప్రధానితోనే సాధ్యం, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు, కాంగ్రెస్, డీఎంకే అడ్రస్ గల్లంతు !

విమానం వేగంతో పోటీ పడుతున్న ఈదురు గాలులు

విమానం వేగంతో పోటీ పడుతున్న ఈదురు గాలులు

నివర్ తుపాను దెబ్బకు చెన్నై ప్రజలు హడలిపోతున్నారు. ఇప్పటికే తమిళనాడులోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నివర్ తుపాను బుధవారం చెన్నై సిటీ సమీపంలోని మహాబలిపురం- కారైక్కాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో తమిళనాడు ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది.

రంగంలోకి ఆర్మీ, ఎన్ డీఆర్ఎఫ్ దళాలు

రంగంలోకి ఆర్మీ, ఎన్ డీఆర్ఎఫ్ దళాలు

తమిళనాడులో ఇప్పటికే ఏడు జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో ఎన్ డీఆర్ఎఫ్ దళాలు, ఆర్మీ సిబ్బంది, గజఈతగాళ్లు రంగంలోకి దిగారు. లోతట్టుప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చెన్నై ప్రజల దాహం తీర్చే జలాశయాలు అన్ని నిండుకుండలా మారిపోవడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ధైర్యంగా ఉండండి: సీఎం హామీ

ధైర్యంగా ఉండండి: సీఎం హామీ

నివర్ తుపాను కారణంగా ప్రజలు సురక్షితంగా ఉండాలని, మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చేసే బాధ్యత మాదే అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రజలకు ధైర్యం చెప్పారు. నివర్ తుపాను కారణంగా తమిళనాడులోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. పరిస్థతిని అంచనా వేసి గురువారం కూడా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించే అవకాశం ఉందని తమిళనాడు ప్రభుత్వ పెద్దలు అంటున్నారు.

హెల్ప్ లైన్ నెంబర్లు, వాట్సాప్ సమాచారం

హెల్ప్ లైన్ నెంబర్లు, వాట్సాప్ సమాచారం

నివర్ తుపాను కారణంగా ప్రజలు సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి తమిళనాడు ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్లు, లోట్ ఫ్రీ నెంబర్లు, వాట్సాప్ నెంబర్లు ప్రజలకు అందుబాటులోకి తీసకు వచ్చింది.

చెన్నై:

*. టోల్ ఫ్రీ నెంబర్ - 1913

*. సహాయవాణి ఫోన్ నెంబర్లు: 044- 25384530, 044- 25384530, 044- 25243454.

*. చెంగల్పట్టు, 044- 27427412, 044- 27427414

*. రాణిపేట్, అనక్కోణం, 04177 236360, 94450 00507

*. అర్కాట్, 04172 235568, 94450 00505.

*. వాలాజి, 04172 232519, 94450 00506.

*. నాగపట్టణం, 04365 252500

*. అరియలూరు, 04329 226700.

*. కడలూరు, 04142 220700.

*. కాంచీపురం, వాట్పాప్ నెంబర్ - 94450 71077.

*. తిరువూర్, 93453 36838

*. తంజావూరు. 93453 36838

*. కోయంబత్తూరు, 0422 230114, 2301523.

*. కారైకల్, సహాయవాణి: 1070 / 1077.

*. సెంట్రల్ కంట్రోల్ రూమ్. 04368 228801, 04368 227704.

*. విపత్తు నిర్వహణా కేంద్రం నెంబర్లు, 1077, 044- 27237207.

English summary
Nivar Cyclone: Here is a list of helpline numbers released by government for emergencies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X