• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మర్కజ్ మసీదుపై సంచలన తీర్పు -మిగతా మతాలకు లేని నిషేధం దానిపై ఎందుకు? -రంజాన్ వేళ తెరవండి

|

మర్కజ్ మసీదు.. ఈ పేరు వినగానే గతేడాది వివాదం కళ్ల ముందు గిర్రున తిరుగుతుంది. ఢిల్లీ శివారు నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ మసీదులో కిందటేడాది తబ్లిగీ జమాత్ కార్యక్రమం వైరస్ వ్యాప్తికి కేంద్రంగా ఉండటం, నాటకీయ పరిణామాల మధ్య మసీదును, దాని ప్రాంగనంలోని మదర్సా, హాస్టళ్లను పోలీసులు ఖాళీ చేయించడం, నిర్వాహకులపై కేసులు పెట్డడం తెలిసిందే. దేశమంతా వైరస్ పాకడానికి తబ్లిగీలే కారణమని, జీహాద్ లో భాగంగానే తబ్లీగీలు దుశ్చ్యకు ఒడిగట్టారని హిందూ అతివాదులు, బీజేపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. సీన్ కట్ చేస్తే..

సిగ్గుందా.. వాలంటీర్లు జగన్ సైన్యాలా? -షర్మిల పార్టీకి విజయమ్మ అధ్యక్షురాలా? -వైసీపీ ఎంపీ రఘురామ ఫైర్సిగ్గుందా.. వాలంటీర్లు జగన్ సైన్యాలా? -షర్మిల పార్టీకి విజయమ్మ అధ్యక్షురాలా? -వైసీపీ ఎంపీ రఘురామ ఫైర్

 ఏడాదిగా మసీదు మూసివేత..

ఏడాదిగా మసీదు మూసివేత..

గతేడాది కరోనా తొలి దశ వ్యాప్తిలో విస్ఫోటనం తర్వాత నిజాముద్దీన్ లోని మర్కజ్ మసీదును పూర్తిగా మూసేశారు. దాంతో అక్కడ మదర్సాతోపాటు మతపరమైన కార్యక్రమాలన్నీ నిలిచిపోయాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సామూహిక ప్రార్థనలు చేశారంటూ మసీదు నిర్వాహకులపై ఢిల్లీ పోలీసులు కేసులు పెట్టారు. మర్కజ్ మసీదులో తబ్లీగీ జమాన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన విదేశీయులను సైతం జైళ్లలో వేశారు. వివిధ రాష్ట్రాల్లో తబ్లిగీ ఘటనకు అనుంబంధంగా కేసులు నమోదయ్యాయి. సుదీర్ఘ విచారణ తర్వాత కోర్టులు అనూహ్య తీర్పులిచ్చాయి. ఒక వర్గం మీడియా ఉద్దేశపూర్వకంగా తబ్లిగీలను టార్గెట్ చేసిందని, వైరస్ కేవలం వాళ్లవల్లే వ్యాప్తి చెందలేదని పలు కోర్టులు పేర్కొన్నాయి. ఆ తీర్పులు ఎలా ఉన్నా నిజాముద్దీన్ మర్కజ్ మసీదు మాత్రం ఏడాదిగా లాక్ డౌన్ లోనే ఉండింది. కేవలం..

 కేంద్రం, ఢిల్లీ పోలీసులకు చుక్కెదురు..

కేంద్రం, ఢిల్లీ పోలీసులకు చుక్కెదురు..

గడిచిన ఏడాది కాలంగా నిజాముద్దీన్ మర్కజ్ మసీదు వద్ద కేవంల ప్రార్థన సమయంలో ఒకరిద్దరిని మాత్రమే ప్రాంగణంలోనికి అనుమతిస్తూ, ప్రధాన స్థలం, మదర్సా, హాస్టళ్లను ఇప్పటికీ మూసేసే ఉంచారు. కాగా, నేడో రేపో రంజాన్ మాసం ప్రారంభం కానున్నందున మసీదులో మళ్లీ ప్రార్థనలకు అనుమతించాల్సిందిగా నిర్వాహకులు కోరగా కేంద్రం, ఢిల్లీ పోలీసులు నో చెప్పారు. దీంతో వివాదం ఢిల్లీ హైకోర్టుకు చేరింది. మర్కజ్ మసీదును పూర్తి స్థాయిలో తెరవడానికి వీల్లేదని, ఒక సమయంలో 20 మంది చొప్పున రోజుకు 200 మందికి మించి అక్కడ ప్రార్థనలు చేయరాదని, కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలోనే ఈ నిషేధాన్ని కొనసాగించాలని అనుకుంటున్నట్లు కేంద్రం, ఢిల్లీ పోలీసుల తరఫు లాయర్లు కోర్టుకు విన్నవించారు. కానీ వారికి భారీ ఎదురుదెబ్బ తగిలింది...

మర్కజ్ మసీదును తెరవండి..

మర్కజ్ మసీదును తెరవండి..

‘‘రంజాన్ పండుగ వేళ నిజాముద్దీన్ మర్కజ్ మసీదును భక్తులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాల్సిందే. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో రోజుకు 200 మందినే అనుమతిస్తామని కేంద్రం, పోలీసులు అంటున్నారు. కానీ ఆ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులేవీ జారీ కాలేదు. భక్తుల సంఖ్య విషయంలో ఇతర మతాలు, ఇతర మతాల ప్రార్థనా స్థలాలు లేదా వేడుకల స్థలాలకు లేని నిషేధాలు ఒక్క మర్కజ్ మసీదు విషయంలోనే ఉండాలనడం భావ్యం కాదు. నిజంగా మత ప్రార్థనలపై ఏవైనా నిషేధాగ్నలు ఉంటే కచ్చితంగా అవి అమలు కావాల్సిందే. కానీ ఒక మతం పట్ల భిన్నమైన ఆదేశాలు ఇవ్వలేం. రంజాన్ వేళ ఎవరైనా మసీదులోకి వచ్చి ప్రార్థనలు చేసుకునే వెసులుబాటు కల్పించాల్సిందే'' అని జస్టిస్ ముక్తా గుప్తా తీర్పు చెప్పారు. అంతేకాదు,

మసీదులో సీసీటీవీ కెమెరాలు..

మసీదులో సీసీటీవీ కెమెరాలు..

నమాజ్ చేయడానికి వచ్చే వారి సంఖ్యపై కేంద్రం, ఢిల్లీ పోలీసులు ఆంక్షలు విధించడాన్ని తప్పు పడుతూ ఢిల్లీ వక్ఫ్ బోర్డు తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. కొవిడ్ నిబంధనల అమలులో మర్కజ్ మసీదు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుందని, ప్రధాన మసీదు లోపల సీసీటీవీ కెమెరా ఏర్పాటుకు కూడా సమ్మతించామని, సోషల్ డిస్టెన్స్ నియమాలను కూడా ఆచరిస్తామని, ఇవన్నీ ముందుగానే చెప్పినప్పటికీ కేంద్రం ఏకపక్ష ధోరణిలో వ్యవహరించిందని వక్ఫ్ బోర్డు తరఫు న్యాయవాది చెప్పారు. ఢిల్లీ హైకోర్టు తాజా ఆదేశాలతో స్థానిక అధికారులు, పోలీసులు మరోసారి మర్కజ్ మసీదును పరిశీలించి, కొవిడ్ జాగ్రత్తలను పర్యవేక్షిస్తారు. రంజాన్ మాసం మొదలైన వెంటనే మర్కజ్ మసీదులోనూ సామూహిక ప్రార్థనలు పున:ప్రారంభం అవుతాయి. ఇదిలా ఉంటే..

కుంభమేళాను తబ్లీగీతో పోల్చొద్దు..

కుంభమేళాను తబ్లీగీతో పోల్చొద్దు..

హిందువులు ఎంతో పవిత్రంగా భావించే హరిద్వార్ కుంభమేళా కన్నుల పండువగా కొనసాగుతున్నది. గంగానదిలో పుణ్యస్నానాల కోసం భక్తులు వెల్లువలా తరలిరావడంతో చాలా చోట్ల కరోనా నిబంధనలు అమలు చేసే వీలులేకపోయింది. గంగానదీ పరివాహక ప్రాంతాలన్నీ భక్తజనసంద్రంగా మారాయి. దేశంలో వైరస్ వ్యాప్తి మళ్లీ విజృంభిస్తుండటం, కుభమేళా మరో తబ్లీగీలా కేసుల పెరుగుదలకు దారి తీస్తుందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ ఈ వాదనను ఖండించారు. కుంభమేళాను తబ్లీగీతో పోల్చొద్దని, గంగా స్నానం ఎంతో పవిత్రమైనది అన్నారు.

ఈసీ సంచలనం: సీఎం మమతపై 24 గంటల నిషేధం -అసాధారణ స్థాయికి బెంగాల్ ఎన్నికల పోరుఈసీ సంచలనం: సీఎం మమతపై 24 గంటల నిషేధం -అసాధారణ స్థాయికి బెంగాల్ ఎన్నికల పోరు

English summary
Observing that there cannot be a fixed list of devotees allowed to enter the Nizamuddin Markaz when no other religious place has such norms, the Delhi High Court Monday asked the Centre and Delhi Police to open Masjid Bangley Wali for prayers during Ramzan in accordance with Delhi Disaster Management Authority (DDMA) guidelines. The court rejected the Centre and Delhi Police’s submission that only 20 people be allowed to enter the premises for prayers at a time out of a police-verified list of 200 persons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X