వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉన్నావ్ బాధితురాలి కంప్లైంట్‌ను పోలీసులు బుట్టదాఖలు చేశారు.. కోర్టుకు వివరించిన సీబీఐ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఉన్నావ్ బాధితురాలి లైంగికదాడిలో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూస్తున్నాయి. యువతికి ఉద్యోగం ఇస్తానని చెప్పి ఎమ్మెల్యే కుల్ దీప్ సింగ్ సెంగార్, అతని అనుచరుడు శశి సింగ్ లైంగికదాడి చేశారని సీబీఐ ఇప్పటికే స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. మరోవైపు బాధిత యువతి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని వివరించింది. స్థానిక పోలీసులను ఎమ్మెల్యే ప్రభావితం చేశాడని .. అందుకే కేసు నమోదవడంలో జాప్య జరిగిందని ఢిల్లీ కోర్టుకు సీబీఐ మరో నివేదిక సమర్పించింది.

లైంగికదాడి కేసులో తమ విచారణ జరుగుతుందని పేర్కొన్నది. కానీ ప్రజాప్రతినిధి అయిన సెంగార్ తన పలుకుబడిని ఉపయోగించి ... కేసును ప్రభావితం చేశారని తెలిపింది. లైంగికదాడికి సంబంధించి ఎమ్మెల్యేపై కేసు పెడితే .. వారు ఏకంగా బాలిక తండ్రిపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని గుర్తుచేశారు. పోలీసుల వేధింపులు తాళలేక బాలిక తండ్రి చనిపోవడంతో కేసు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

No Action On Unnao Survivors Complaint Under Influence Of MLA

ఏం జరిగిందంటే ..
ఉన్నావ్ కేసు విచారణకు సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్‌లో అందజేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన వివరాలు ఢిల్లీ కోర్టుకు అందజేసిన అధికారులు .. ఏం జరిగిందో వివరించారు. 2017లో ఉన్నావ్ బాధితురాలు అదృష్టవశాత్తు బయటపడిందని పేర్కొన్నారు. సెంగార్, అతని అనుచరుడు శశి సింగ్ బాధితురాలిపై లైంగికదాడి చేసినట్టు వివరించారు. ఆ సమయంలో యువతి మైనర్ అని .. ఉద్యోగం పేరుతో మభ్యపెట్టి లైంగికదాడి చేశారని తెలిపింది. ఉపాధి కోసం యువతి ఆశపడి వచ్చిందని ... ఆ సమయంలో సెంగార్ ఇంటి వద్ద సెక్యురిటీ సిబ్బంది కూడా లేరని వెల్లడించింది. యువతిని ఇంటి వెనకాల నుంచి తీసుకొని .. తర్వాత ఇంట్లో లైంగికదాడి చేశాడని చెప్పింది. తర్వాత ఉద్యోగం ఇవ్వకపోగా వేధింపులకు గురిచేశారు. ఇదేంటని నిలదీయడంతో బాధితురాలి తండ్రిపై కక్షపూరితంగా కేసు పెట్టారు. ఎమ్మెల్యే అండతో స్థానిక పోలీసుల అతడిని దాడి చేయడంతో చనిపోయాడు. అప్పటినుంచి ఎమ్మెల్యేపై బాధితురాలి పోరాడుతూనే ఉన్నారు.

English summary
The CBI has told a Delhi court that Uttar Pradesh Police was "lackadaisical" in handling the 2017 case of a minor girl who was raped in Unnao allegedly by MLA Kuldeep Singh Sengar. In its charges filed on July 11, 2018, the probe agency said they were investigating the role of authorities of the district administration and medical hospitals in Unnao district. "During investigation, action taken by local police on several complaints on the incidents were also collected which showed lackadaisical approach of local thana police and supervisory police officers," the charge sheet said. The CBI added that further investigation was going on in this matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X