వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోమవారం వరకు ఆస్తానాపై చర్యలు వద్దు: ఢిల్లీ హైకోర్టు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తను లంచం తీసుకున్నట్లుగా ఆరోపిస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ అస్తానా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును తన పిటిషన్‌లో కోరారు రాకేష్ ఆస్తానా. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ రాజేంద్ర మీనన్ కేసును మరో బెంచ్‌కు అప్పజెప్పారు.

సీబీఐ విచారణకు పిలువదని టీడీసీ ఎంపీ హామీ ఇచ్చారు
విచారణ స్వీకరించిన బెంచ్ సీబీఐ స్పెషల్ డైరెక్టర్ ఆస్తానా పై ఎలాంటి బలవంతపు చర్యలకు పాల్పడరాదని పేర్కొంది. అప్పటి వరకు ఆయన్ను అరెస్టు చేయరాదని ఆదేశించింది. కేసును అక్టోబర్ 29కి వాయిదా వేసింది. పిటిషనర్లు తమ వద్ద ఉన్న ఆధారాలను భద్రపరుచుకోవాలని ఎలక్ట్రానిక్ రికార్డులన్నిటినీ జాగ్రత్తగా ఉంచుకోవాలని పిటిషనర్లను కోర్టు కోరింది. అంతేకాదు అస్తానా ఆరోపణలపై సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ అక్టోబర్ 29న వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

 No action should be taken on Rakesh Asthana till Monday, says Delhi high court

సోమవారం రాకేష్ ఆస్తానా కేసుకు సంబంధించి డీఎస్పీ దేవేందర్ కుమార్‌ను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మాంసం ఎగుమతి దారుడు మోయిన్ ఖురేషీ కేసులో విచారణాధికారిగా ఉన్న దేవేందర్ కుమార్ ...ఖురేషీని కేసునుంచి తప్పించేందుకు తప్పుడు స్టేట్‌మెంట్ రికార్డ్ చేసినట్లు సీబీఐ గుర్తించింది. కేసుకు సంబంధించి సతీష్ సానా అనే వ్యాపారస్తుడి స్టేట్‌మెంట్‌ను సెప్టెంబర్ 26,2018లో కావాలనే రికార్డు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుకు విచారణాధికారిగా రాకేష్ ఆస్తానా ఉన్నారు. గతంలో సీబీఐ డెరెక్టర్‌ అలోక్ వర్మకు లంచం ఇచ్చినట్లు సతీష్ సానా స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు దేవేందర్ కుమార్ విచారణ చేసి నివేదికలో పొందుపర్చారు. ఇదిలా ఉంటే తను ఆ స్టేట్‌మెంట్ అసలు ఇవ్వలేదని సతీష్ చెప్పాడు. స్టేట్ మెంట్ రికార్డు చేసినట్లు చెబుతున్న సమయంలో తాను హైదరాబాద్‌లో ఉన్నట్లు స్పష్టం చేశాడు.

English summary
The Delhi High Court on Tuesday provided interim relief to Special CBI Director Rakesh Asthana saying that no action can be taken against him till the next date of hearing on Monday.Asthana had moved the court against the lodging of an FIR against him in a bribery case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X