వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

300ఫ్లైట్ల రద్దు: మండిపోయిన టికెట్ల ధరలు, ఢిల్లీ-ముంబై రూ.60వేలు!

ఢిల్లీ-ముంబై మధ్య విమాన ప్రయాణ టికెట్‌ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ధర బుధ, గురువారాల్లో రూ.లక్ష ఉన్నట్లు గురువారం వార్తలు వచ్చాయి.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాలుష్యం కారణంగా భారీగా విమానాలు రద్దు కావడంతో ఢిల్లీ-ముంబై మధ్య విమాన ప్రయాణ టికెట్‌ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఈ ధర బుధ, గురువారాల్లో రూ.లక్ష ఉన్నట్లు గురువారం వార్తలు వచ్చాయి.

అంతలేదా?

అంతలేదా?

కాగా, శుక్రవారం కూడా విమాన టికెట్‌ ధర రూ.45,039 ఉన్నట్లు అందులో ఉంది. కానీ, అవన్నీ అవాస్తమని టికెట్‌ ధరలు సాధారణంగానే ఉన్నట్లు ఆ తర్వాత తేలింది.

ఢిల్లీ-ముంబై..రూ.60వేలు

ఢిల్లీ-ముంబై..రూ.60వేలు

గురువారం టికెట్‌ ధర వాస్తవానికి రూ.60వేలు వరకూ ఉంది కానీ, లక్ష రూపాయలకు చేరలేదని కొన్ని విమానయాన సంస్థలు తెలిపాయి. అదే రోజుల్లో మరికొన్ని విమాన సంస్థల్లో టికెట్‌ ధర రూ.7వేల నుంచి రూ.10 వేల వరకు ఉన్నాయని వివరించాయి.

300విమానాల రద్దు..

300విమానాల రద్దు..

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో విపరీతమైన వాయు కాలుష్యం కారణంగా రన్‌వే మూసివేయడంతో పాటు దాదాపు 300 విమానాలను రద్దు చేశారు. ఈ నేపథ్యంలోనే టికెట్‌ ధరలు భారీగా పెరిగిపోయినట్లు వార్తలు వచ్చాయి.

రేట్లు పెరిగాయి..

రేట్లు పెరిగాయి..

అయితే, బుధవారం ఢిల్లీ-ముంబై వన్‌ వే టికెట్‌ ధర రూ.24వేల నుంచి రూ.29వేల వరకు చూపించింది. ఢిల్లీలో కాలుష్యం కారణంగా విమాన టికెట్‌ ధరలు 40శాతం పెరిగాయి. గత నెల రేట్లతో పోల్చితే ప్రస్తుతం 19 శాతం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
Certain reports on Thursday morning claimed that prices of air tickets on Wednesday for Delhi-Mumbai route soared upto Rs 1,05,000 while the same for Friday were priced at Rs 45,039. Additionally, Mumbai-based no-frills budget airline was charging Rs 43,518 for a flight from Delhi, but a little research into the same showed a different picture.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X