వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రముఖ నటి కిడ్నాప్ లైంగిక దాడి కేసు: దిలీప్ కు నో బెయిల్: హైకోర్టు, హీరోకు జైలే గతి!

|
Google Oneindia TeluguNews

కొచ్చి: ప్రముఖ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మాలీవుడ్ స్టార్ హీరో దిలీప్ బెయిల్ పిటీషన్ విచారణ చేసిన కేరళ హైకోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. దిలీప్ కు వ్యతిరేకంగా బలమైన సాక్షాలు ఉన్నాయని కేరళ హై కోర్టు చెప్పింది.

నటి నగ్న ఫోటోలు, వీడియో ఇవ్వు: రూ. కోట్లు ఇస్తా, మలయాళం హీరో దిలీప్ బంపర్ ఆఫర్!నటి నగ్న ఫోటోలు, వీడియో ఇవ్వు: రూ. కోట్లు ఇస్తా, మలయాళం హీరో దిలీప్ బంపర్ ఆఫర్!

నటి కిడ్నాప్ చేసి సామూహిక లైంగిక దాడి చెయ్యాలని దిలీప్ సూచించాడని ఈ కేసులో అరెస్టు అయిన ప్రముఖ నిందితుడు సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సునీ అంగీకరించాడని పోలీసులు కోర్టులో చెప్పారు. దిలీప్ కు బెయిల్ ఇస్తే కేసు విచారణకు అంతరాయం కలుగుతుందని పోలీసులు అన్నారు.

No Bail for Malayalam actor Dileep from Kerala High Court.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ సైతం దిలీప్ కు బెయిల్ ఇవ్వరాదని, అతనికి బెయిల్ ఇస్తే రాజకీయంగా, డబ్బు ప్రభావంతో సాక్షాలు తారుమారు చేసే అవకాశం ఉందని ఇంతకు ముందే కోర్టులో చెప్పారు. అయితే దిలీప్ న్యాయవాది రామ్ కుమార్ మాత్రం ఈ కేసులో తన క్లైంట్ కు ఎలాంటి సంబంధం లేదని వాదించారు.

ప్రముఖ నటి సామూహిక లైంగిక దాడి కేసు: కాంగ్రెస్ ఎమ్మెల్యే విచారణ, ఏం చెప్పారంటే?ప్రముఖ నటి సామూహిక లైంగిక దాడి కేసు: కాంగ్రెస్ ఎమ్మెల్యే విచారణ, ఏం చెప్పారంటే?

దిలీప్ కు బెయిల్ ఇవ్వాలని కోర్టులో మనవి చేశారు. ఇరు వర్గాల వాదన విన్న కేరళ హైకోర్టు గత నాలుగు రోజుగా పోలీసులు సేకరించిన సాక్షాలు పరిశీలించింది. సోమవారం కేరళ హైకోర్టు దిలీప్ కు బెయిల్ ఇవ్వడం కుదరదని చెప్పింది. ఈ దెబ్బతో హీరో దిలీప్ షాక్ కు గురైనాడు. హీరో దిలీప్ ఇప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించడానికి సిద్దం అయ్యాడు.

English summary
Attack Against Actress: No Bail for actor Dileep from Kerala High Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X