వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ వాహనాలపై నిషేధం విధించే యోచన లేదు: నితిన్ గడ్కరీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ వాహనాలపై నిషేధం విధించడం లేదని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఆటో మోబైల్ పరిశ్రమ పరిస్థితి అత్యంత క్లిష్ట సమయాన్ని ఎదొర్కొంటున్న నేపథ్యంలో గడ్కరీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సేల్స్ రేట్ దారుణంగా పడిపోవడంతో చాలా కార్ల సంస్థలు ప్లాంట్లను మూసివేసే పరిస్థితి తలెత్తింది.

ముందస్తు బెయిల్ తిరస్కరించిన సుప్రిం కోర్టు... నేడు ఈడీ కస్టడీలోకి చిదంబరం ..ముందస్తు బెయిల్ తిరస్కరించిన సుప్రిం కోర్టు... నేడు ఈడీ కస్టడీలోకి చిదంబరం ..

వెహికల్ స్క్రాపేజ్ విధానంను కూడా తీసుకురావాలే యోచనలో ప్రభుత్వం ఉందని గడ్కరీ చెప్పారు. హైబ్రీడ్ వాహనాలపై జీఎస్టీని తగ్గించాలని కూడా ప్రభుత్వం ఆలోచనగా ఉన్నట్లు గడ్కరీ చెప్పారు. కన్జ్యూమర్ డిమాండ్ తగ్గిపోవడంతో కార్ల సేల్స్ కూడా అత్యంత దారుణంగా పడిపోయాయి. ఈ క్రమంలోనే ఆటోమొబైల్ ఇండస్ట్రీని బతికించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లుగా సమాచారం. ఇప్పటికే సేల్స్ పడిపోవడంతో తమ పరికరాల ఉత్పత్తిని కూడా ఆయా సంస్థలు తగ్గించేశాయి.

No ban on Petrol and diesel vehicles, calrifies Nitin Gadkari

ఇక ఆటోమొబైల్ ఇండస్ట్రీని తిరిగి గాడిలోకి పెట్టేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ప్రభుత్వ శాఖలు కొత్త వాహనాలను మార్చి 31,2020 వరకు కొనుగోలు చేయాలని సూచించింది. ఆర్థిక వ్యవస్థ మందగించడంతో ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఘోరంగా దెబ్బతినింది.ఇక తమ సేల్స్‌ను పెంచే క్రమంలో కొనుగోలుదారులకు ఎన్‌బీఎఫ్‌సీ నుంచి రుణాలు ఇప్పించేలా ఆ ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలతో మాట్లాడేందుకు చొరవ చూపాలని సూచించారు.

English summary
Union Transport Minister Nitin Gadkari today said that the government is not planning to ban petrol and diesel vehicles. His comments come as the auto industry battles its worst slowdown in several years that has led to several carmakers announcing plant shutdowns to cut production.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X