వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీచ్‌లలో బికినీలపై నిషేధం లేదు: గోవా సిఎం పారికర్

|
Google Oneindia TeluguNews

పనాజీ: గోవా బీచ్‌లలో బికినీలను ధరించడంపై నిషేధం విధిస్తారన్న అంశంపై బుధవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ స్పష్టతనిచ్చారు. గోవాలోని బీచ్‌లలో బికినీలపై ఎలాంటి నిషేధం విధించడం లేదని ఆయన తెలిపారు. అయితే బహిరంగ ప్రదేశాల్ల మద్యం సేవించడాన్ని నిషేధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

బీచ్‌లలో బికినీలు ధరించడాన్ని నిషేధించాలని డిమాండ్ చేసిన తన మంత్రివర్గ సహచరుడు సుదిన్ ధవాలికర్ వ్యాఖ్యలపై స్పందించమని మీడియా కోరగా ఆయన స్పందించారు. బీచ్‌లలో బికినీలను ధరించడంపై గోవా ప్రభుత్వం నిషేధం విధించదని తెలిపారు. దీని ద్వారా సభ్యతకు ఎలాంటి ప్రమాదం పొంచివుండదని అన్నారు. పబ్బులపై కూడా ఎలాంటి నిషేధం విధించడం లేదని చెప్పారు.

No bikini ban on Goa's beaches, CM Manohar Parrikar says

ఇటీవల గోవా మంత్రి ధవాలికర్ మాట్లాడుతూ.. గోవా బీచ్‌లలో బికినీ ధరించడంపై నిషేధం విధించే అవకాశాలున్నాయని చెప్పారు. ఇది ప్రతీ సంవత్సరం వచ్చే విదేశీ పర్యాటకులపై ఎలాంటి ప్రభావం చూపబోదని అన్నారు.

బహిరంగ ప్రదేశాల్లో యువతులు బికినీలు ధరించడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులను నియంత్రించడం కష్టంగా మారుతోందని చెప్పారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఆలస్యమవుతుందని అభిప్రాయపడ్డారు. అందువల్ల ఇలాంటి చర్యలను నియంత్రించాల్సిన అవసరం ఉందని అన్నారు. గోవా సిఎం కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నారని చెప్పారు. ధవాలికర్ వ్యాఖ్యలపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో గోవా సిఎం మనోహర్ పారికర్ పై విధంగా స్పందించారు.

English summary
Goa chief minister ManoharParrikar on Wednesday ruled out banning wearing of bikinis on the state's beaches, a day after a minister in his government advocated such a measure, but said drinking of liquor in public places will be prohibited.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X