వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్ : దక్షిణాదిలో బీజేపీకి గడ్డుకాలమే.. ఏపీ, తెలంగాణలో ఖాతా తెరిచే ఛాన్సే లేదు

|
Google Oneindia TeluguNews

ఉత్తరాదిలో సత్తా చాటిన బీజేపీ దక్షిణాదిలో మాత్రం చతికిలపడినట్లు ఏబీపీ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్‌ను బట్టి తెలుస్తోంది. దక్షిణభారతంలో మొత్తం 128సీట్లు ఉండగా.. బీజేపీకి మాత్రం చేదు అనుభవమే మిగలనున్నట్లు సర్వే ఫలితాలు చెబుతున్నాయి. కర్నాటకలో మినహా ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుందని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఖాతాయే తెరవదని సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. దక్షిణాదిన బీజేపీ 27, కాంగ్రెస్ 53, ఇతరులు 48సీట్లు గెలుచుకుంటారని ఏబీపీ అంచనా వేసింది. కర్నాటకలో మాత్రం బీజేపీ పరిస్థితి కాస్త మెరుగుపడిందని, అక్కడ 28సీట్లలో బీజేపీ 15, కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు 13 స్థానాల్లో గెలుపొందుతాయని ఏబీపీ సర్వే స్పష్టం చేసింది.

20 స్థానాలున్న కేరళలో కాంగ్రెస్ 16, ఇతరులు 4 సీట్లు గెలుచుకుంటారని ఏబీపీ అంచనా వేసింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో , తెలంగాణలో బీజేపీ ఖాతా తెరిచే ప్రసక్తేలేదని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఏపీలో 25సీట్లలో వైఎస్ఆర్‌సీపీ 20 స్థానాల్లో విజయం సాధించనుండగా.. టీడీపీ 5 సీట్లు గెల్చుకోనుంది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ 17లో 16స్థానాల్లో విజయఢంకా మోగిస్తుందని ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్ తేల్చిచెప్పింది.

ఏబీపీ ఎగ్జిట్ పోల్ సర్వే : అతిపెద్ద పార్టీగా బీజేపీ.. మెజార్టీకి ఐదడుగుల దూరంలో ఎన్డీఏ..ఏబీపీ ఎగ్జిట్ పోల్ సర్వే : అతిపెద్ద పార్టీగా బీజేపీ.. మెజార్టీకి ఐదడుగుల దూరంలో ఎన్డీఏ..

No BJP impact in Southern states
English summary
ABP predicts there is No BJP impact in Southern states. bjp will not get huge number of seats in these states. in ap ycp will get 20 seats and tdp to just 5. in telangana KCR's TRS will win 16 out of 17 seats
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X