వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఏఏ రద్దు, జాబ్స్, ఫ్రీ కరెంట్ - అస్సాంకు కాంగ్రెస్ 5 కీలక హామీలు -తేయాకు తోటల్లో ప్రియాంక సందడి

|
Google Oneindia TeluguNews

అస్సాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేయమని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. అంతే కాకుండా ఆ చట్టాన్ని నిలిపివేసేలా మరో చట్టాన్ని తీసుకువస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని తేజ్‌పూర్‌లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రియాంక గాంధీ పాల్గొని ప్రసంగించారు.

విభజించి పాలించు అనే సూత్రాన్ని బీజేపీ పక్కాగా అమలు చేస్తోందని, ప్రజల మధ్య కుల, మత, ప్రాంతీయ, జాతి విభేదాలను పెంచడానికి కుట్రలు చేస్తోందని, సీఏఏ అనే దుర్మర్గపు చట్టంతో దేశంలో విభజన రేఖలు గీస్తున్నారని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. సీఏఏ ప్రభావం అస్సాంపై చాలా ఎక్కువ ఉందని, కాంగ్రెస్ అధికారంలోకి ఐదు కలకమైన హామీలను నెరవేస్తామని చెప్పారు. అస్సాంలో సీఏఏ రద్దు, 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ప్రియాంక వెల్లడించారు.

No CAA, 5 lakh jobs among congress 5 guarantees for Assam priyanka gandhi Plucked Tea Leaves

అసోంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బిశ్వనాథ్‌లో టీ గార్డెన్ కార్మికులతో మంగళవారంనాడు ప్రియాంక మమేక మయ్యారు. తానూ ఓ కార్మికురాలిగా మారి టీ ఆకులను కోస్తూ కనిపించారు. నుదుటికి బ్యాండ్ కట్టుకుని, వీపు వెనుక బుట్టను ఏర్పాటు చేసుకుని అందులో టీ ఆకులు వేస్తూ కార్మికులతో ముచ్చటించారు. నడుముకు ఏప్రాన్‌ కూడా కట్టుకున్నారు.

No CAA, 5 lakh jobs among congress 5 guarantees for Assam priyanka gandhi Plucked Tea Leaves

అన్ని విషయాల్లో అండగా ఉంటామని తేయాకు కార్మికులకు ప్రియాంక భరోసా ఇచ్చారు. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో మార్చి 27 నుంచి మూడు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. సుమారు 35 సీట్లలో తేయాకు కార్మికులు ఆయా పార్టీల అభ్యర్థుల భవితవ్వాన్ని నిర్దేశించగలుగుతుతారు.

English summary
Senior Congress leader Priyanka Gandhi on Tuesday asserted that her party, if voted to power in Assam, will bring a new law to "nullify" the Citizenship Amendment Act (CAA) in the state. Gandhi, during a public meeting in Tezpur, launched the 'Five Guarantees' campaign, and said her party, if given a chance to form government in the northeastern state, will dole out Rs 2,000 every month to homemakers across the state, and provide free electricity up to 200 units to all households.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X