హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమిత్ షాపై పైచేయి: ట్రబుల్ షూటర్ శివకుమార్‌కు కీలక పదవి, కుమారస్వామి ఇచ్చినా దానికి నో

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ - జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. ట్రబుల్ షూటర్ శివకుమార్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఉంటుందని తొలుత భావించారు. కానీ జేడీఎస్ అధినేతలతో ఆయనకు ఉన్న విభేదాల కారణంగా వారు నో చెప్పారు. దీంతో ఉప ముఖ్యమంత్రి పదవి కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పరమేశ్వరను వరించింది.

ఈ నేపథ్యంలో కర్ణాటకలో కాంగ్రెస్ - జేడీఎస్ ప్రభుత్వం నిలదొక్కుకోవడంలో కీలక పాత్ర పోషించిన శివకుమార్‌కు కేబినెట్లో చోటు దక్కక పోవడంతో అధిష్టానం ఆయనకు కేపీసీసీ చీఫ్ పోస్టును కట్టబెట్టనుంది. కుమారస్వామి, శివకుమార్‌లకు పాత వైరం ఉంది. కానీ ప్రభుత్వ ఏర్పాటు కోసం ఇరువురు కలిసి ప్రత్యక్షంగా పరోక్షంగా పని చేశారు.

కర్ణాటక ఎప్పుడూ ఇంతే: యడ్యూరప్పను రెండుసార్లు దెబ్బతీసిన కుమారస్వామికర్ణాటక ఎప్పుడూ ఇంతే: యడ్యూరప్పను రెండుసార్లు దెబ్బతీసిన కుమారస్వామి

కుమారస్వామి పదవి ఇచ్చినా ట్రబుల్ షూటర్ నో

కుమారస్వామి పదవి ఇచ్చినా ట్రబుల్ షూటర్ నో

అయితే, జేడీఎస్ అధినేతలతో పాత వైరం కారణంగా శివకుమార్‌కు కేబినెట్లో చోటు ఇచ్చేందుకు కుమారస్వామి, దేవేగౌడలు సుముఖంగా లేరు. అలాగే, వారి కేబినెట్లో పని చేసేందుకు శివకుమార్‌కు కూడా ఆసక్తి లేదని తెలుస్తోంది. ఇప్పటికే పరమేశ్వరకు డీప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని నిర్ణయించారు. ఒకవేళ తనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినా శివకుమార్ నిరాకరించేవారట. ఎందుకంటే కుమారస్వామి సీఎంగా, తాను డిప్యూటీగా ఆయన వద్ద పని చేసేందుకు ఆయనకు ఆసక్తి లేదట.

శివకుమార్‌కు అధ్యక్ష పదవి

శివకుమార్‌కు అధ్యక్ష పదవి

బీజేపీపై శివకుమార్ మూడుసార్లు పైచేయి సాధించారు. గతంలో గుజరాత్‌లోని ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించి రాజ్యసభకు అహ్మద్ పటేల్‌ను పంపటంలో కీలకంగా వ్యవహరించారు. బెంగళూరులో భద్రత కల్పించారు. అంతకుముందు విలాస్ రావు దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సమయంలో మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా శివకుమార్ కాపాడారు. కర్ణాటక కాంగ్రెస్‌లో గట్టి ధనబలం ఉన్న నేత శివకుమార్. 2014 నుంచి వరుసగా బీజేపీ విజయాలు సాధిస్తోంది. వ్యూహరచన పరంగా అప్పటి నుంచి కాంగ్రెస్ గెలుపు ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే, కర్ణాటకలో కీలక పాత్ర పోషించిన శివకుమార్‌కు కేపీసీసీ పదవి కట్టబెట్టాలని అధిష్టానం నిర్ణయించింది.

రేసులో శివకుమార్ ముందంజ

రేసులో శివకుమార్ ముందంజ

కేపీసీసీ రేసుకు సంబంధించిన జాబితాను ఇటీవల అధిష్టానంకు పంపించారు. ఈ రేసులో శివకుమార్ ముందంజలో ఉన్నారు. ఇప్పుడు ఆయన కీలక పాత్ర నేపథ్యంలో ఆయనకే కట్టబెట్టాలని యోచిస్తున్నారు. మునియప్ప, పరమేశ్వరలు కూడా రేసులో ఉన్నారు. వీరిద్దరు దళిత సామాజిక వర్గానికి చెందిన వారు. పరమేశ్వరకు డిప్యూటీ సీఎం ఇవ్వనున్నారు. మరోవైపు సిద్ధరామయ్య.. ఎస్సార్ పాటిల్ పేరును ప్రతిపాదిస్తున్నారు. కానీ అందుకు అధిష్టానం సుముఖంగా లేదని తెలుస్తోంది.

 అమిత్ షాపై రెండుసార్లు పైచేయి

అమిత్ షాపై రెండుసార్లు పైచేయి


కర్ణాటకలో చక్రం తిప్పిన శివకుమార్‌కు మంచి పదవి ఇవ్వాలనే యోచనలో అధిష్టానం ఉందని అంటున్నారు. కొత్త ప్రభుత్ంలో ఆయనకు పాత్ర ఉండదు కాబట్టి, అందులో భాగంగా కేపీసీసీ చీఫ్ పోస్టు అంటున్నారు. పైగా శివకుమార్‌కు ఆ పదవి ఇస్తే వొక్కలింగల మద్దతు కూడగట్టినట్లవుతుందని భావిస్తున్నారు. కర్ణాటకలో గట్టి బలం ఉన్న వోక్కలింగ నేత శివకుమార్. పాత మైసూరు ప్రాంతంలో వీరి ప్రభావం ఎక్కువ. గుజరాత్, కర్ణాటకలో పార్టీని గట్టెక్కించిన శివకుమార్‌కు పదవి సముచితమని అధిష్టానం భావిస్తోందని తెలుస్తోంది. వ్యూహాలకు దిట్ట అయిన అమిత్ షా పైన రెండుసార్లు పైచేయి సాధించారు.

English summary
They made a picture perfect pair when they flashed the victory symbol after B S Yeddyurappa resigned as the Chief Minister of Karnataka. The old rivals H D Kumaraswamy and D K Shivakumar stood strong as they ensured that the BJP did not have the numbers to form the government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X