వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలితకు చికిత్స: గదిలో సీసీ కెమెరాలు లేవు: అపోలో ప్రతాప్ సీ. రెడ్డి, జడ్ ఫ్లస్ సెక్యూరిటీ ?

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఆసుపత్రిలో ఎలాంటి చికిత్స చేశారు అనే పూర్తి సమాచారం మా దగ్గర భద్రంగా ఉందని, విచారణ కమిషన్ కు ఇవ్వడానికి తాము సిద్దంగా ఉన్నామని అపోలో ఆసుపత్రి గ్రూప్ ల చైర్మన్ .

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఆసుపత్రిలో ఎలాంటి చికిత్స చేశారు అనే పూర్తి సమాచారం మా దగ్గర భద్రంగా ఉందని, విచారణ కమిషన్ కు ఇవ్వడానికి తాము సిద్దంగా ఉన్నామని అపోలో ఆసుపత్రి గ్రూప్ ల చైర్మన్ ప్రతాప్ సీ. రెడ్డి అన్నారు.

జయలలిత చివరి రోజుల్లో ఏం జరిగింది: వివరణ ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు!జయలలిత చివరి రోజుల్లో ఏం జరిగింది: వివరణ ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు!

బుధవారం అపోలో ఆసుపత్రి సమీపంలో జరిగిన ఓ ఈవెంట్ లో అపోలో ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్ సీ. రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జయలలిత చికిత్స పొందిన గదిలో సీసీ కెమెరాలు లేవని ప్రతాప్ సీ. రెడ్డి చెప్పారు.

No CCTV camera Jayalalithas room says apollo hospital Pratap Reddy

జయలలితకు 75 రోజుల పాటు చికిత్స అందించామని, చికిత్స సమయంలో ఆమెకు ఎలాంటి ఔషదాలు ఇచ్చాము, ఎలాంటి చికిత్స చేశాము, ఆమె ఏమేమి ఆహారం తీసుకున్నారు, ఆమెను ఎవరెవరు కలిశారు అనే పూర్తి సమాచారం ఉన్న రికార్డులు మాదగ్గర జాగ్రత్తగా ఉన్నాయని ప్రతాప్ సీ. రెడ్డి వివరించారు.

అపోలో ఆసుపత్రిలో జయలలితను మంత్రులు అందరూ చూశారు: బాంబు పేల్చిన మంత్రి !అపోలో ఆసుపత్రిలో జయలలితను మంత్రులు అందరూ చూశారు: బాంబు పేల్చిన మంత్రి !

ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన జయలలిత చికిత్స పొందుతున్న గదిలో ఎందుకు సీసీ కెమెరాలు లేవు అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తింది. జయలలిత ఆసుపత్రిలో చేరిన తరువాత అయినా ఆమె భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని అమ్మ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో చేరిన వెంటనే జయలలితకు భద్రత కల్పిస్తున్న జడ్ ఫ్లస్ సెక్యూరిటీ అక్కడి నుంచి మాయం కావడం చర్చకు దారి తీసింది.

English summary
Apollo Hospital's Managing Director Pratap Reddy says there was no CCTV camera inside the room where Jayalalitha admitted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X