వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరి దుస్తులు వారిష్టం, అశ్లీలమనిపిస్తే: గోవా సిఎం

By Pratap
|
Google Oneindia TeluguNews

పనాజీ: గోవాలో ఎలాంటి దుస్తులైనా ధరించవచ్చునని ముఖ్యమంత్రి మనోహర్ పరిక్కర్ స్పష్టం చేశారు. దుస్తుల వ్యవహారంలో మితీమీరిన అశ్లీలత అనిపిస్తే ఎవరైనా కేసు నమోదు చేసుకోవచ్చని ఆయన బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో తెలిపారు.

అసెంబ్లీలో కాంగ్రెస్ శాసన సభ్యుడు అలెక్సో లారెన్కో లేవనెత్తిన ప్రశ్నకు సమాధానమిస్తూ - అశ్లీలత మాటున ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మహిళలను వేధిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని పరిక్కర్ అన్నారు.

 No change in policy over dress code on beaches: Manohar Parrikar

అభ్యంతరకరమైన దుస్తులు ధరించారని కేసులో ఎవరైనా కేసు నమోదు చేసి కోర్టుకు వెళ్లవచ్చని పరిక్కర్ సూచించారు. గోవాలో బికినీ, మినీ స్కర్టులను నిషేధించాలని గోవా మంత్రి సుదీన్ దావాల్కర్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

వస్త్రధారణ విషయంలో ప్రభుత్వ విధానం ఏదీ మారలేదని పరిక్కర్ చెప్పారు. పర్యాటక స్థలంలో నైతికమైన పోలీసింగ్‌ను అనుమతించబోమని ఆయన అన్నారు. పబ్ కల్చర్ అంటే ఏమిటనేది ప్రజలకు స్పష్టత వచ్చేవరకు దానిపై ప్రభుత్వ వైఖరి చెప్పబోనని ఆయన అన్నారు.

English summary

 Weeks after his minister kicked up a row with his comment that bikinis should be banned, Goa Chief Minister Manohar Parrikar today said the government's policy on dress code at beaches remains unchanged and that any moral policing in the tourist destination would not be tolerated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X