వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా మాట చెల్లట్లేదా, మేం క్లియర్: టిపై జవదేకర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

No clarity in Congress: Prakash Jawadekar
న్యూఢిల్లీ: తెలంగాణ విషయంలో తమ పార్టీ మొదటి నుండి స్పష్టమైన వైఖరితో ఉందని, కాంగ్రెసు పార్టీలోనే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట చెల్లడం లేదా? అని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ సోమవారం ప్రశ్నించారు. తెలంగాణ విషయంలో బిజెపిలో విభేదాలు ఉన్నాయనే ప్రచారం నేపథ్యంలో జవదేకర్ ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇరు ప్రాంతాల నేతలతో కలిసి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.

సొంత పార్టీ ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు, నేతలు విభజనను వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెసు పార్టీ పైన నిప్పులు చెరిగారు. కాంగ్రెసు పార్టీ విభజనతో రాజకీయాలు చేస్తోందన్నారు. బిజెపి విధానం మొదటి నుండి చాలా స్పష్టంగా ఉందని చెప్పారు. కాంగ్రెసు పార్టీలో సోనియా, ఆ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ మాట చెల్లడం లేదా అని ప్రశ్నించారు.

పార్లమెంటును కాంగ్రెసు పార్టీ సజావుగా నడపలేకపోతుందన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ సొంత పార్టీ నేతలను వదిలి పెట్టి తమ పార్టీ లోకసభ పక్ష సభ్యురాలు సుష్మా స్వరాజ్ పైన ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. కాంగ్రెసు పార్టీ సొంతింటిని చక్కదిద్దుకోవాలని హితవు పలికారు.

లోకసభ నుంచి సస్పెండ్ చేసిన తమపై బహిష్కరణ నిర్ణయం ఎత్తివేసిన తర్వాతే బిల్లు ప్రవేశపెట్టాలని టిడిపి సీమాంధ్ర ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో తమకు పార్టీల కన్నా ప్రజలే ముఖ్యమన్నారు. రేపు సభలో బిల్లుపై చర్చ సందర్భంగా సీమాంధ్ర నేతలు గొడవ చేయకుండా ఉండాలని సూచించేందుకే రాహుల్ గాంధీ వారితో భేటీ కానున్నారన్నారు.

English summary
BJP spokes person Prakash Jawadekar on Monday said their party have clarity on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X