వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్థాన్‌కు సమాధానం చెప్పని ప్రధాని మోడీ.. పీవోకే పై క్లారీటిలేని ప్రసంగం

|
Google Oneindia TeluguNews

జమ్ము కశ్మీర్ పరిణామాలపై మొదటి సారిగా మాట్లాడిన మోడీ పీవోకే ఉసు మాత్రం ఎత్తలేదు. కశ్మీర్ అభివృద్ది, రాజకీయ పరిణామాలపై మాత్రమే మోడీ దృష్టిపెట్టాడు. అయితే భారత్ నిర్ణయం పై పాకిస్థాన్ వ్యతిరేకంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో పాకిస్థాన్‌కు దీటుగా సమాధానం ఇస్తారని భావించారు. కాని రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఎలాంటీ వ్యాఖ్యలు చేయకుండానే మోడీ ప్రసంగం ముగిసింది. ముఖ్యంగా పీవోకేలో కూడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని అమిత్ షా పార్లమెంట్‌లో ప్రకటించిన నేపథ్యంలోనే దానిపై స్పందిస్తారని అంతా భావించారు.

కశ్మీర్ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తితోపాటు ఆరాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడంతో, ప్రపంచ దేశాలతో పాటు భారత దేశ ప్రజల దృష్టి మొత్తం ప్రధాని మోడీపై పెట్టారు. దీంతో కశ్మీర్‌ అభివృద్దికి ఎలాంటీ నిర్ణయాలు తీసుకోబుతున్నారనే ఉత్కంఠ నెలకోంది. ఇందుకు అనుగుణంగానే ప్రత్యేకంగా కశ్మీర్ పరిణామాలపై మోడీ ప్రసంగాన్ని వినేందుకు దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూశారు.

no clarity on POK in modi speech

కాని మోడీ ప్రసంగం మాత్రం రోటిన్‌గానే కొనసాగింది. కశ్మీర్‌లో ఎలాంటీ హింసాయుత పరిణామాలు చెలరేగకుండా చర్యలు చేపట్టిన మోడీ భారత దేశ అంతర్గత వ్యవహరంగా భావిస్తున్న కశ్మీర్ విభజనపై పాకిస్థాన్ రాద్ధంతాం చేస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే భారత్ నిర్ణయాన్ని పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో పాటు కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయాలని భావిస్తోంది. కేంద్రబలగాల ఆధీనంలో ఉన్న కశ్మీర్ ఇప్పుడు బాగానే ఉంది, అసలు విషయం ముందుంది అంటూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ట్వీట్ చేశాడు. కర్ఫ్యూ తొలగించిన తర్వాత జరిగే పరిణామాలపైనే అంతర్జాతీయ దేశాలు ఎదురు చుస్తున్నాయని పేర్కోన్నారు. కశ్మీర్‌ను విభజించి తమ విజయంగా బీజేపీ ప్రభుత్వం భావిస్తోందని అన్నారు.

దీంతో పాకిస్థాన్‌కు దీటుగా మోడీ సమాధానం చెబుతారని అంతా ఊహించారు. పాక్ అక్రమిత కశ్శీర్ ‌లోకూడ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన అమిత్ ప్రకటనపై పూర్తిగా క్లారీటి లేని పరిస్థితుల్లో దానిపై స్పందిస్తారని బావించారు. పాకిస్థాన్ అక్రమిత కశ్మీర్‌లో ఎలా ఎన్నికలు నిర్వహించి భారత దేశంలో అంతర్భగంగా తీసుకువస్తారనే ప్రశ్నలకు మోడీ ప్రసంగంలో జవాబు మాత్రం లభించలేదు.

English summary
prime minister narendra modi did not touch on pok issue,who spoke for the first time on the developments in Jammu and Kashmir,Modi only focus on Kashmir development and political developments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X