వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జార్ఖండ్ చరిత్రను తిరగరాసే బాహుబలి ఎవరు ?: 19 ఏళ్లలో ఆరు మంది సిట్టింగ్ సీఎంలకు నో చాన్స్, బళ్లాల!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అంటూ పోడీ పడుతున్నాయి. అయితే జార్ఖండ్ చరిత్రంలో ఏ ముఖ్యమంత్రి రెండోసారి అధికారం చేపట్టలేదు. ప్రస్తుత జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఆ చరిత్రను తిరగరాసి బాహుబలిగా నిలుస్తారా ? లేదా మరో బళ్లాల దేవుడిగా మిగిలిపోతారా ? బీజేపీ ఆ శాపం నుంచి విముక్తి పొందుతుందా ? లేదా ? అనే ఉత్కంఠ మొదలైయ్యింది. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటు అయ్యి 19 ఏళ్ల అవుతున్నా అక్కడ మాత్రం ఏ సీఎం రెండోసారి అధికారం చేజిక్కించుకోలేకపోయారు. జార్ఖండ్ ఓటర్లు ఏ పార్టీకి అధికారం కట్టబెడుతున్నారు ? అనే విషయం కొన్ని గంటల్లో తేలిపోతుంది.

నీ భార్య నాకు, నా భార్య నీకు, రాత్రి ఎంజాయ్ చేద్దాం రా, వ్యాపారవేత్తల కొత్త డీల్, బ్లాక్ మెయిల్!నీ భార్య నాకు, నా భార్య నీకు, రాత్రి ఎంజాయ్ చేద్దాం రా, వ్యాపారవేత్తల కొత్త డీల్, బ్లాక్ మెయిల్!

 మీకు ఒక్క చాన్స్ చాలా గొప్ప

మీకు ఒక్క చాన్స్ చాలా గొప్ప

జార్ఖండ్ ప్రజలు ఒక్కసారి మాత్రమే ఒక్కరికి సీఎంగా అవకాశం ఇస్తున్నారు. ఎవరు ఎలాంటి అభివృద్ది చేశారు ? ఎలాంటి అభివృద్ది చేస్తారు ? అనే అంచానా వేస్తున్న ప్రజలు ఒక్కొక్కసారి జరిగే అసెంబ్లీ జరిగే ఎన్నికల్లో ఒక్కొక్కరికి అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి చాన్స్ ఇస్తారు ? అనే విషం కొన్ని గంటల్లో తేలిపోతుంది.

సీఎం దాస్ కు70 వేల మెజారిటీ

సీఎం దాస్ కు70 వేల మెజారిటీ

జార్ఖండ్ లో 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జంషెడ్ఫూర్ ఈస్ట్ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన రఘబర్ దాస్ 70 వేల మెజారిటీ ఓట్లతో గెలుపొంది ఆ రాష్ట్ర సీఎం అయ్యారు. 2019లో జార్ఖండ్ లో మరోసారి రఘుబర్ దాస్ చరిత్రను తిరగరాసి మరోసారి సీఎం పదవి చేపట్టి అధికారంలోకి వస్తారా ? లేదా ? అనే విషయం కొన్ని గంటలు వేచి చూడాలి.

19 ఏళ్లలో 6 మంది సీఎంలు

19 ఏళ్లలో 6 మంది సీఎంలు

2000 నవంబర్ 15వ తేదీన బీహార్ రాష్ట్రం నుంచి జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం ఎర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నిక తరువాత ఆరు మంది ముఖ్యమంత్రులు ఆ రాష్ట్రాన్ని పరిపాలించారు. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత బాబులాల్ మరండి, అర్జున్ ముండా, శిబు సోరెన్, మధు కోడా, హేమంత్ సోరెన్, రఘబర్ దాస్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పదవిలో ఉన్నారు. ఇప్పుడు 2019లో మరోసారి జార్ఖండ్ ఎన్నికలు జరిగాయి.

చరిత్ర తిరగరాస్తారా ?

చరిత్ర తిరగరాస్తారా ?

ప్రస్తుత జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ జార్ఖండ్ చరిత్రను తిరగరాస్తారా ? లేదా ? అనే ఉత్కంఠకు కొన్ని గంటల్లో తెరపడనుంది. జార్ఖండ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి రెండోసారి స్థానిక ఓటర్లు అవకాశం ఇవ్వలేదు. అయితే ఇప్పుడు చరిత్రను తిరగరాసి జార్ఖండ్ లో మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని రఘుబర్ దాస్ తోపాటు బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయా ? లేదా ? అనే విషయం ఈ రోజు తేలిపోతుంది.

సిట్టింగ్ సీఎంలకు సినిమా చూపించిన ఓటర్లు

సిట్టింగ్ సీఎంలకు సినిమా చూపించిన ఓటర్లు

జార్ఖండ్ చరిత్రలో ఆరు మంది ముఖ్యమంత్రుల్లో ఇంత వరకు ఎవ్వరూ రెండోసారి గెలుపొంది అధికారంలోకి రాలేదు. జార్ఖండ్ లో 2008 ఆగస్టు 27వ తేదీ అప్పటి ముఖ్యమంత్రి మధు కోడా తన పదవికి రాజీనామా చేశారు. మధు కోడా రాజీనామా తరువాత జార్ఖండ్ ముక్తి మోర్చ చీఫ్ శిబు సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రికి బాధ్యతలు స్వీకరించారు.

చిత్తూగా ఓడిన సీఎం రాజీనామా!

చిత్తూగా ఓడిన సీఎం రాజీనామా!

రాజ్యంగ నిబంధనల ప్రకారం అప్పటి సీఎం శిబు సోరెన్ కు ఎన్నికల్లో విజయం సాధించడానికి ఆరు నెలల మాత్రమే అవకాశం ఉంది. తరువాత టామర్ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన అప్పటి సీఎం శిబు సోరెన్ 8,973 ఓట్ల తేడాతో ఓడిపోయారు. శిబు సోరెన్ మీద పోటీ చేసిన రాజా పీటర్ కు 34, 127 ఓట్లు రాగా, శిబు సోరెన్ కు 25, 154 ఓట్లు మాత్రమే వచ్చాయి. టామర్ నియోజక వర్గం నుంచి ఓడిపోయిన శిబు సోరెన్ తరువాత సీఎం పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయారు.

 ఎన్నికల సునామీలో మాజీ సీఎంలు ఔట్

ఎన్నికల సునామీలో మాజీ సీఎంలు ఔట్

2014లో జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల సునామీలో నలుగుగరు మాజీ సీఎంలు కొట్టుకుపోయారు. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత మొదటి సీఎంగా అధికారం చేపట్టిన బాబులాల్ మరండి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గిరిదహ్, ధన్వర్ అనే రెండు నియోజక వర్గాల నుంచి పోటీ చేశారు. అయితే బాబులాల్ మరండి గిరిదిహ్ లో బీజేపీ అభ్యర్థి నిర్భయ్ షాహాబాది చేతిలో 31 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ధన్వర్ లో సీపీఐ (ఎంఎల్) రాజ్ కుమార్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. ధన్వర్ నియోజక వర్గం నుంచి బాబులాల్ మరండి మరోసారి పోటీ చేస్తున్నారు. కేంద్ర మంత్రి అర్జున్ ముండా సైతం మూడు సార్లు జార్ఖండ్ సీఎం అయ్యారు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్సావన్ నియోజక వర్గంలో పోటీ చేసిన అర్జున్ ముండా జేఎంఎం నేత దశరత్ గాగ్రై చేతిలో 12, 000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మాజీ సీఎం హేమంత్ సోరెన్ జేఎంఎం చీఫ్ పదవిలో ఉన్నప్పటికీ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బర్హత్ నియోజక వర్గం నుంచి గెలిచినప్పటికీ దుమ్కా నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి లూయిస్ మరాండి చేతిలో ఓడిపోయారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బర్హత్ నియోజక వర్గం నుంచి హేమంత్ సోరెన్ పోటీ చేశారు.

English summary
The electorate of Jharkhand is such that it has never allowed a CM to have a repeat term. No former Jharkhand CM has been able to break this record. That is why it is now on BJP's Raghubar Das to change the state's existing voting patterns.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X