వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంకుల మూసివేత.. ఉత్త ప్రచారమే. : ఆర్‌బీఐ

|
Google Oneindia TeluguNews

పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహాకార బ్యాంకుపై ఆర్‌బీఐ నిబంధనలు విధించిన తర్వాత మరో తొమ్మిది వాణిజ్య బ్యాంకులను మూసివేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయా బ్యాంకుల్లో ఖాతాదారులు నానా హైరాన పడుతున్నారు. ఉన్నపళంగా తమ డిపాజిట్లను తీసుకునేందుకు బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. దీంతో సోషల్ మీడియా ప్రచారంపై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారులు స్పందించారు . సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్ని ఊహాగానాలని చెప్పారు. ఏ బ్యాంకులను మూసివేయడం లేదని అధికారికంగా ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వం ఇటివల పలు బ్యాంకులను విలీనం చేసిన విషయం తెలిసిందే... దీంతొపాటు పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహాకార బ్యాంకుపై ఆర్‌బీఐ నిబంధనలు విధించింది. ఈ నేపథ్యంలోనే మరో తొమ్మిది వాణిజ్య బ్యాంకులు మూసివేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆయా బ్యాంకుల్లో ఉన్న డబ్బులను విత్‌డ్రా చేసుకొవాలని సూచిస్తూ ప్రచారం కొనసాగుతోంది. ప్రచారంలో భాగంగా కార్పోరేషన్ బ్యాంకుతోపాటు, యూకో, ఐడిబిఐ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్, దేనా బ్యాంక్, యునైటైడ్ బ్యాంకులను మూసి వేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది.

 No commercial banks are going to be shut: RBI

అయితే ఇలా వస్తున్న వార్తను ఆర్‌బీఐ ఒక చిలిపి చేష్టగా అభివర్ణించింది. బ్యాంకులను మరింత మూలధనాన్ని సమకూర్చి బలోపేతం చేస్తామని చెప్పారు. ఈ సంధర్భంలోనే ఏ ప్రభుత్వ రంగ బ్యాంకును కూడ మూసివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాగా పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహాకార బ్యాంకుపై ఆర్‌బీఐ నిబంధనలు విధించిన నేపథ్యంలోనే ఆరునెలల పాటు 1000కి మించి నగదును ఉపసంహరించుకునే అవకాశం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే.

English summary
Reserve Bank of India (RBI) on Wednesday said no commercial banks are going to be shut.and rebutted social media romours
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X