వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గల్లా ప్రసంగానికి చెక్: పిట్టకథతో పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసిన బీజేపీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లోక్ సభ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలని టీడీపీ ఎంపీలు చర్చ జరుపుతున్న సమయంలో బీజేపీ నాయకులు ఆ విషయాన్ని పక్కదోవ పట్టించడానికి ప్రయత్నాలు చేశారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కేంద్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తున్న సమయంలో బీజేపీ ఎంపీలు జోక్యం చేసుకున్నారు. గల్లా జయదేవ్ ప్రసంగాన్ని పదేపదే అడ్డుకుని కర్ణాటక సీఎం, కాంగ్రెస్ పిట్టకథ చెప్పి చర్చ పక్కదోవ పట్టించడానికి ప్రయత్నించారు.

Recommended Video

ఇది ఆధిక్యతకు, నైతికతకు మధ్య జరుగుతున్న యుద్ధం : గల్లా జయదేవ్
తెర మీదకు కర్ణాటక సీఎం

తెర మీదకు కర్ణాటక సీఎం

గల్లా జయదేవ్ ప్రసంగాన్ని అడ్డుకున్న బీజేపీ ఎంపీ రాకేష్ సింగ్ కాంగ్రెస్ పార్టీ, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి పిట్టకథ చెప్పడం మొదలుపెట్టారు. ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి బహిరంగంగా కన్నీరు పెట్టుకున్న విషయం దేశం మొత్తం చూసిందని బీజేపీ ఎంపీ రాకేష్ సింగ్ అన్నారు.

కాంగ్రెస్ నిజంగా విషం

కాంగ్రెస్ నిజంగా విషం


ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా తాను సంతోషంగా లేనని, విషం గొంతులో పెట్టుకుని ఉన్నానని హెచ్.డి. కుమారస్వామి అన్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నా, ఆ పార్టీకి మద్దతు ఇచ్చిన పార్టీలు విషం సేవించాల్సిందేనని బీజేపీ ఎంపీ రాకేష్ సింగ్ అన్నారు.

కాంగ్రెస్ అవినీతి

కాంగ్రెస్ అవినీతి


అనేక దశాభ్దాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అవినీతిలో అగ్రస్థానంలో నిలిచిందని బీజేపీ ఎంపీ రాకేష్ సింగ్ ఆరోపించారు. ఆ సందర్బంలో లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖార్గే అభ్యంతంరం వ్యక్తం చేశారు. ఇంత చేసినా కర్ణాటకలో మీకు (కాంగ్రెస్)కు ముఖ్యమంత్రి కుర్చి దక్కలేదని బీజేపీ ఎంపీ రాకేష్ సింగ్ విమర్శించారు. ఆ సమయంలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మద్య వాగ్వివాదం జరగడంతో గందరగోళం ఎర్పడింది.

మోడీ ప్రభుత్వం సూపర్

మోడీ ప్రభుత్వం సూపర్

గత నాలుగు ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిజాయితీగా ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసిందని బీజేపీ ఎంపీ రాకేష్ సింగ్ సమర్థించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని దూరదృష్టితో అభివృద్ది చేస్తున్నారని రాకేష్ సింగ్ కితాబు ఇచ్చారు.

2019లో నరేంద్ర మోడీ ప్రధాని

2019లో నరేంద్ర మోడీ ప్రధాని

2019లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అవుతారని రాకేష్ సింగ్ జోస్యం చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తిస్ ఘడ్ తదితర రాష్ట్రాలు అభివృద్దితో దూసుకు వెలుతున్నాయని, కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట మొత్తం అవినీతి ఉందని బీజేపీ ఎంపీ రాకేష్ సింగ్ ఆరోపించారు.

English summary
Monsoon Session 2018: No confidence motion against BJP led NDA government by Congress led opposition parties. BJP MP Rakesh Singh mentions Karnataka Chief minister HD Kumaraswamy in his speech.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X