వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీగిన అవిశ్వాసం: వైసీపీ మాయలో పడొద్దని బాబుకు ఫోన్ చేశానన్న మోడీ, ఏపీకి హామీ, ప్రధానికి రాహుల్ హగ్

|
Google Oneindia TeluguNews

Recommended Video

    వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో చిక్కుకోవద్దని చంద్రబాబుకు చెప్పాం: మోడీ

    న్యూఢిల్లీ: లోక్‌సభలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాసానికి మద్దతుగా 126 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 325 ఓట్లు వచ్చాయి. దీంతో అవిశ్వాసం వీగిపోయినట్లు స్పీకర్ సుమిత్ర మహాజన్ ప్రకటించారు. సమావేశాలు శుక్రవారం రాత్రి 11.15నిమిషాల వరకు జరగడం గమనార్హం.

    No confidence motion LIVE: Modi govt faces its first no-confidence motion

    చర్చ సందర్భంగా పార్టీల వారీగా కేటాయించిన సమయం:

    No confidence motion LIVE: Modi govt faces its first no-confidence motion

    టీడీపీ: 13నిమిషాలు
    కాంగ్రెస్: 38నిమిషాలు
    అన్నాడీఎంకే: 29నిమిషాలు
    టీఎంసీ: 27నిమిషాలు
    బీజేడీ: 15నిమిషాలు
    టీఆర్ఎస్: 9నిమిషాలు
    బీజేపీ: 3గంటల 33నిమిషాలు

    Newest First Oldest First
    11:14 PM, 20 Jul

    అనంతరం సమావేశాలను సోమవారం(జులై23)కు వాయిదా వేశారు.
    11:14 PM, 20 Jul

    ఓటింగ్ అనంతరం అవిశ్వాసం వీగిపోయినట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.
    11:10 PM, 20 Jul

    మొత్తం 451 ఓట్లలో అవిశ్వాసానికి మద్దతుగా 126 ఓట్లు రాగా, అవిశ్వాసానికి వ్యతిరేకంగా 325 ఓట్లు వచ్చాయి. దీంతో అవిశ్వాసం వీగిపోయింది.
    10:58 PM, 20 Jul

    స్పీకర్ సుమిత్ర మహాజన్ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు.
    10:56 PM, 20 Jul

    ప్రధాని గొప్ప నటుడని, 2014 ఎన్నికల ముందు కూడా ఆయన ఇలాగే నటించారని కేశినేని నాని ఆరోపించారు.
    10:53 PM, 20 Jul

    ప్రధాని అద్భుతంగా ప్రసంగించారని, బాలీవుడ్ హిట్ సినిమాను తలపించేలా ఉందని టీడీపీ ఎంపీ కేీశినేని నాని ఎద్దేవా చేశారు.
    10:48 PM, 20 Jul

    ఏపీ ప్రజల అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.
    10:40 PM, 20 Jul

    ప్రతి ఇంటికి విద్యుత్, బ్యాంకు ఖాతా, గ్యాస్ కనెక్షన్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని తెలిపారు.
    10:38 PM, 20 Jul

    సాగరమాలతో పోర్టులు అభివృద్ధి చేస్తున్నామని మోడీ తెలిపారు.
    10:37 PM, 20 Jul

    మహిళలకు తమ ప్రభుత్వం అండగా ఉంటోందని, తలాక్ నుంచి ముస్లిం మహిళలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి మరణ శిక్ష విధించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలితపారు.
    10:32 PM, 20 Jul

    బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఎన్పీఏల కట్టడికి అనేక చర్యలు తీసుకున్నామని తెలిపారు.
    10:28 PM, 20 Jul

    తమ ప్రభుత్వం డిజిటల్ విప్లవం తీసుకొచ్చిందని, ఇప్పుడంతా అన్‌లైన్ వ్యవహారాలు సాగుతున్నాయని చెప్పారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ విస్తృతంగా జరుగుతోందని చెప్పారు.
    10:26 PM, 20 Jul

    ముద్ర యోజన కింద రుణాలు మంజూరు చేసి యువతకు ఉపాధి అవకాశాలను కల్పించామని మోడీ తెలిపారు.
    10:24 PM, 20 Jul

    తమ ప్రభుత్వం రైతులకు అండగా ఉందని ప్రధాని చెప్పారు. వారి కోసం అనేక పథకాలను తీసుకొచ్చామని చెప్పారు. ఎంఎస్‌పీ తీసుకొచ్చామని తెలిపారు.
    10:23 PM, 20 Jul

    దేశ ప్రజల అభివృద్ధి కోసమే జీఎస్టీనీ తీసుకొచ్చామని ప్రధాని మోడీ తెలిపారు.
    10:22 PM, 20 Jul

    బీజేపీయేతర రాష్ట్రాలకు కూడా కేంద్రం నిధులు మంజూరు చేసి అభివృద్ధి సహకరిస్తోందని మోడీ చెప్పారు.
    10:21 PM, 20 Jul

    రాజధాని, రైతులు, ఏ విషయమైనా ఏపీ ప్రజలకు కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.
    10:20 PM, 20 Jul

    హోదా విషయంలో వైయస్సార్సీపీ మాయలో పడొద్దని చంద్రబాబుకు ఫోన్ చేసి చెప్పా.. కానీ ఆయన వినలేదని మోడీ చెప్పారు. ఏపీకి కావాల్సిన సాయం చేస్తామని చెప్పామని తెలిపారు.
    10:18 PM, 20 Jul

    తెలుగుదేశం ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి హోదాపై యూటర్న్ తీసుకుని, కేంద్రంపై విమర్శలు చేస్తోందని మోడీ ఆరోపించారు.
    10:18 PM, 20 Jul

    ఏపీ సీఎం ప్యాకేజీకి ఒప్పుకుని ఆర్థికమంత్రికి ధన్యవాదాలు తెలిపారరని మోడీ అన్నారు.
    10:17 PM, 20 Jul

    ఏపీ ప్రజల ఆశలు, ఆకాంక్షలను గౌరవించి.. ప్రత్యేక ప్యాకేజీని రూపొందించి.. హోదాతో వచ్చే ప్రయోజనాలను కల్పిస్తామని 2016లోనే చెప్పామని తెలిపారు.
    10:16 PM, 20 Jul

    ప్రత్యేక హోదా కంటే మంచి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పామని ప్రధాని మోడీ చెప్పారు.
    10:16 PM, 20 Jul

    రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగుతల్లి స్ఫూర్తి కాపాడాలని కోరుకుంటున్నానని ప్రధాని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు మధ్య కొంత విభేదాలున్నట్లు తెలుస్తోందని చెప్పారు.
    10:15 PM, 20 Jul

    వాజపేయీ హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే ఎలాంటి గొడవలు జరగలేదని ప్రధాని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో దేశాన్ని విభజించి సమస్యను ఇప్పటికీ పరిష్కరించకుండా చేశారని మండిపడ్డారు. ఇప్పుడు తెలంగాణ, ఏపీ విషయం కూడా అలానే మార్చారని ధ్వజమెత్తారు.
    10:14 PM, 20 Jul

    రెండు రాష్ట్రాలకు న్యాయం చేయకుండా విభజించారు.
    10:13 PM, 20 Jul

    నాడు పార్లమెంటులో తలుపులు మూసీ ఆంధ్రా, తెలంగాణలను రాష్ట్రాలుగా విభజించారని మోడీ అన్నారు.
    10:12 PM, 20 Jul

    రైతులు, ప్రజలు, యువత ఆకాంక్షలను నెరవేర్చే సేవకుడిని, భాగస్వామిని అని మోడీ వ్యాఖ్యానించారు.
    10:12 PM, 20 Jul

    కుయుక్తుల ద్వారా ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ దారులు వెతుకుందని ఆరోపించారు.
    10:11 PM, 20 Jul

    రిజర్వేషన్లు పోతాయి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిర్వీర్యం చేస్తారని దుష్స్రచారం చేస్తున్నారని మోడీ మండిపడ్డారు.
    10:07 PM, 20 Jul

    దళితులు, మైనార్టీలు, రైతుల మనోభావాలతో ఆడుకుంటూ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ ధ్వజమెత్తారు.
    READ MORE

    English summary
    The day of reckoning for the BJP led NDA government is here as it faces its first no-confidence motion in Parliament. Comfortably perched where the numbers are concerned, the BJP would use the motion as an opportunity to showcase its government.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X