వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా: లాక్‌డౌన్ ఎగ్జిట్‌పైనే కసరత్తు.. 400 జిల్లాల్లో ఒక్క కేసూ లేదు.. జీవనోపాధి కూడా ముఖ్యమే

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్ ఈనెల 14తో ముగియనుంది. మిగతా దేశాలతో పోల్చుకుంటే వైరస్ ఉధృతి తక్కువగానే ఉన్నప్పటికీ.. ఏ చిన్న విషయాన్ని కూడా తేలికగా తీసుకోరాదని భారత ప్రభుత్వం భావిస్తున్నది. దీంతో లాక్ డౌన్ కొనసాగింపు లేదా ఎత్తివేతపై ప్రధాని సంప్రదింపులు జరుపుతున్నారు.

Recommended Video

Lockdown Extension Exit: Need To Balance Lives And Livelihood

బుధవారం ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని పార్టీల పార్లమెంటరీ నేతలు తమ అభిప్రాయాన్ని చెప్పారు. అందులో 80 శాతం మంది లాక్ డౌన్ పొడగింపునకు మొగ్గుచూపాయి. ఈ విషయాన్ని ఆయా నేతలే మీడియాకు చెప్పారు. పలు రాష్ట్రాలు కూడా పొడగింపును కోరుతున్న దరిమిలా ఏప్రిల్ 14తో లాక్ డౌన్ ఎత్తివేత కుదరకపోవచ్చని ప్రధాని మోదీ అన్నట్లు రిపోర్టులు వచ్చాయి. కరోనా తర్వాత కూడా వ్యక్తిగత, సామాజిక మార్పులెన్నో జరగాల్సి ఉంటుందనీ ఆయన అభిప్రాయపడినట్లు తెలిసింది. కానీ ఈలోపే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి.

కొనసాగింపు కాదది..

కొనసాగింపు కాదది..


కేంద్రం ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్ ఈ నెల 14తో ముగుస్తుందని, ఆలోపే ప్రభుత్వం కచ్చితమైన వ్యూహంతో ముందుకొస్తుందని రాజీవ్ కుమార్ చెప్పారు. అయితే, ఏప్రిల్ 14 తర్వాత జరిగేదానిని పొడగింపుగానో, కొనసాగింపుగానూ భావించరాదని, దాన్ని ‘లాక్ డౌన్ ఎగ్జిట్'గానే ఆ ప్రక్రియను పరిగణించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘లాక్ డౌన్ ఎగ్జిట్ ప్రక్రియలో భాగంగానే కేంద్రం సంప్రదింపులు జరుపుతున్నది. ముఖ్యమంత్రులతో మరోసారి మాట్లాడిన తర్వాత ప్రధాని దీనిపై నిర్ణయం తీసుకుంటారు''అని చెప్పారు.

400 జిల్లాల్లో కేసులు లేవు..

400 జిల్లాల్లో కేసులు లేవు..


మన దేశంలో మొత్తం 736 జిల్లాలు ఉండగా, వాటిలో గరిష్టంగా 400 జిల్లాల్లో కొవిడ్-19 కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ తెలిపారు. దేశవ్యాప్తంగా కేవలం 62 జిల్లాల్లోనే వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటిదాకా నమోదైన కేసుల్లో 80 శాతం ఆ 62 జిల్లాల్లోనివే కావడం గమనార్హమని రాజీవ్ కుమార్ అన్నారు. ఇటు, కేంద్ర ఆరోగ్య శాఖ అధికారిక ప్రకటనల్లోనూ ఎఫెక్టెడ్ జిల్లాల సంఖ్యను ప్రముఖంగా ప్రచురిస్తూ వస్తుండటం రాజీవ్ వ్యాఖ్యలకు బలం చేకూర్చుతున్నది. ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఇప్పటిదాకా కరోనా ఎఫెక్టెడ్ జిల్లాల సంఖ్య 300లోపే ఉంది. పైగా,

ఆ రెండూ ఇంపార్టెంటే..

ఆ రెండూ ఇంపార్టెంటే..

అసలే అంతంతమాత్రంగా ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ.. సుదీర్ఘకాలం లాక్ డౌన్ ను తట్టుకోలేదని, తక్కువ ప్రమాదం ఉన్న రంగాలకు లాక్ డౌన్ నుంచి సడలింపు కల్పించాలనే వాదన మొదటి నుంచీ ఉన్నదే. ఈ మేరకు అవకాశాల్ని పరిశీలించాల్సిందిగా ప్రధాని మోదీ తన మంత్రుల్ని పురమాయించారు కూడా. కానీ దీనిపై పెద్ద రాష్ట్రాల నుంచి వ్యతిరేకత రావడంతో.. ‘లాక్ డౌన్ పాక్షిక సడలింపు' ఆలోచనను కేంద్రం విరమించుకుంది. ప్రజల ప్రాణాలు కాపాడుకోడానికి కఠిన నిర్ణయాలు తప్పవని నేతలు చెబుతున్నప్పటికీ.. జీవితాలతోపాటు జీవనోపాధి కూడా చాలా ముఖ్యమైన అంశమని, బతుకును-బతుకుదెరువును బ్యాలెన్స్ చేస్తూ నిర్ణయాలు తీసుకోవడమే మంచిదని రాజీవ్ కుమార్ సూచించారు.

ఇవీ తాజా లెక్కలు..

ఇవీ తాజా లెక్కలు..

బుధవారం సాయంత్రం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం దేశంలో కొవిడ్-19 రోగుల సంఖ్య 5274కు పెరిగింది. అందులో 410మందికి వ్యాధి నయంకాగా, 149 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో అత్యధికంగా 1135 కేసులు నమోదయ్యాయి. అయితే అక్కడ వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్(లోకల్ వ్యాప్తి) లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తం 14 రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో 100కుపైగా కేసులుండగా, 10లోపే కేసులున్న రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 11 ఉన్నాయి.

English summary
The NITI Aayog vice-chairman also said that India would have to find a balance between lives and livelihood. At present, 62 districts in the country accounted for 80 percent of the coronavirus infections, while there were no cases in 400 districts, Kumar said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X