వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ర్యాలీకి , బీహార్ ఎన్నికలకు లేని కోవిడ్ రూల్స్ రైతులకేనా .. యోగేంద్ర యాదవ్ సూటిప్రశ్న

|
Google Oneindia TeluguNews

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మరోమారు వివిధ రాష్ట్రాల్లోని రైతులు కదంతొక్కారు. ఈరోజు ఢిల్లీకి రైతులు లాంగ్ మార్చ్ నిర్వహించాలని బయలుదేరిన నేపథ్యంలో, హింసాత్మకంగా మారింది. పోలీసులు ఎక్కడికక్కడ రైతుల అణిచివేసే కార్యక్రమాలను చేపట్టారు. దేశంలోని పలు రాష్ట్రాల రైతులు ఢిల్లీకి లాంగ్ మార్చ్ నిర్వహించడానికి బయల్దేరడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హర్యానా రాష్ట్రంలో లాంగ్ మార్చ్ కి వెళ్లాలని ప్రయత్నించిన రైతులను, ప్రతిపక్ష పార్టీల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ముంబై మారణహోమానికి 12 ఏళ్ళు .. చేదు జ్ఞాపకాలు, మానని గాయాలు .. అమరులకు నివాళి ముంబై మారణహోమానికి 12 ఏళ్ళు .. చేదు జ్ఞాపకాలు, మానని గాయాలు .. అమరులకు నివాళి

 రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ర్యాలీకి కరోనా లేదా ?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ర్యాలీకి కరోనా లేదా ?

గురుగ్రామ్‌లో హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్న స్వరాజ్ ఇండియా చీఫ్ యోగేంద్ర యాదవ్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై అణిచివేతకు కరోనావైరస్ మహమ్మారి కారణమైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ఇటీవల రైతులతో ర్యాలీ ఎందుకు నిర్వహించారు అని ప్రశ్నించారు. మనోహర్‌లాల్ ఖత్తర్ నేతృత్వంలోని రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం వద్ద చాలా వింత మహమ్మారి ఉందని ఆయన పేర్కొన్నారు.

 హర్యానా రాష్ట్రంలో కరోనా ఒక వింత మహమ్మారి .. అధికార పార్టీ అనుకుంటేనే

హర్యానా రాష్ట్రంలో కరోనా ఒక వింత మహమ్మారి .. అధికార పార్టీ అనుకుంటేనే

మూడు రోజుల క్రితం, దుష్యంత్ చౌతాలా వేలాది మంది రైతులతో ర్యాలీ చేశాడు. మాస్కులు ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా దుష్యంత్ చౌతాలా ర్యాలీ నిర్వహించినప్పుడు కరోనా మహమ్మారి లేదు. బీహార్ ఎన్నికలు జరిగాయి అప్పుడు కూడా కరోనా మహమ్మారి లేదు. రైతులు సమావేశమైనప్పుడు, రైతులు తమ నిరసనను తెలియజేస్తున్నప్పుడు మాత్రమే కరోనా మహమ్మారి ఉంది. ఇది చాలా వింత మహమ్మారి అంటూ పేర్కొన్నారు.
అధికార పార్టీకి అనుకూలం కాని కార్యక్రమాలకు మాత్రమే కరోనా గుర్తొస్తుందని మండిపడ్డారు .

 నాడు బ్రిటీష్ పాలన తలపించేలా నేటి పాలన .. అణచివేతలు

నాడు బ్రిటీష్ పాలన తలపించేలా నేటి పాలన .. అణచివేతలు

భారత స్వాతంత్రం కోసం, నాడు బెంగాల్ స్వాతంత్ర్యం కోసం పోరాడిన బెంగాల్‌లోని స్వాతంత్ర్య సమరయోధుల మాదిరిగానే, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల రైతులు దేశవ్యాప్తంగా రైతుల కోసం పోరాడుతున్నారని పేర్కొన్న ఆయన రైతుల అణగదొక్కడం కోసం ప్రభుత్వం ఉపయోగిస్తున్న వ్యూహాలు నాడు బ్రిటిష్ వారు వినియోగించిన వ్యూహాల మాదిరిగానే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఇది చాలా దారుణం అంటూ ప్రభుత్వ తీరును ఖండించారు యోగేంద్ర యాదవ్.

English summary
Swaraj India chief Yogendra Yadav, detained by the Haryana Police at Gurugram, questioned why the state's Deputy Chief Minister Dushyant Chautala recently held a rally with farmers if the coronavirus pandemic was the cause for crackdown on protesting farmers. "It is a very strange pandemic," said in a jibe at the state's BJP government led by Manoharlal Khattar."Three days ago, Dushyant Chautala rallied thousands of farmers. No mask. No social distancing. Then there is no pandemic. Bihar election - no pandemic. When farmers gather, then there is pandemic. This must be a very strange disease," he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X