వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపిఏ హయాంలో జరిగిన సర్జికల్ స్ట్ర్రైక్స్ వివరాలు లేవు : భారత ఆర్మీ

|
Google Oneindia TeluguNews

2016 కు ముందు పాకిస్థాన్ పై జరిగిన సర్జికల్ స్ట్ర్రైక్స్ వివరాలు లేవంటూ భారత సైన్యం స్పష్టం చేసింది. జమ్ముకు చెందిన ఓ కార్యకర్త ఆర్టీఐ ద్వార 2004 నుండి 2014వరకు యూపిఏ హయాంలో పాకిస్థాన్ పై జరిగిన సర్జికల్ స్ట్ర్రైక్స్ వివరాలు అడగడంతో పాటు 2014 తర్వాత జరిగిన దాడులలో ఎన్ని సక్సెస్ అయ్యాయంటూ ఆర్టీఐ ద్వార ధరఖాస్తు చేశాడు.

పుల్వామా దాడీ , బాలకోట్ ఉదంతం తోపాటు ప్రస్థుత ఎన్నికల నేపథ్యంలో భద్రతాదళాల విజయానికి సంబంధించి కాంగ్రెస్ , బీజేపీల మధ్య పోలిటికల్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే ,ప్రధానంగా పుల్వామా దాడి జరిగిన తర్వాత బాలకోట్ సర్జికల్ స్ట్ర్రైక్ ప్రభుత్వం విజయంతంగా పూర్తి చేసింది. దీంతో ఆ క్రెడిట్‌ను తీసుకునేందుకు ప్రధాని నరేంద్రమోడీ ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఆ క్రెడిట్ ను ఆపేందుకు కాంగ్రెస్ పార్టీ సైతం ప్రయత్నాలు చేస్తోంది.భధ్రతా దళాలకు సంబంధించి రాజకీయం చేయడంపై ఆపార్టీ మోడీపై విమర్శలు ఎక్కుపెట్టింది.

మోడీ ప్రచారానికి దీటుగా కాంగ్రెస్ ప్రచారం

మోడీ ప్రచారానికి దీటుగా కాంగ్రెస్ ప్రచారం

కాగా మోడీ బాలకోట్ విజయాన్ని ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో దానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది. ఈనేపథ్యంలో యూపిఏ హయంలో పలుసార్లు సర్జికల్ దాడులు జరిగాయని అవన్ని అంతర్గత విషయాలు కావడంతో బయటపెట్టలేదని స్వయంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. . అయితే మోడీ వలే భద్రతా దళాల అంశాన్ని ఓట్ల కోసం వాడకోవడం లేదని మన్మోహన్ అన్నారు.

2004 నుండి 14వరకు జరిగిన సర్జికల్ స్ట్ర్రైక్ వివరాలు ఇవ్వండి

2004 నుండి 14వరకు జరిగిన సర్జికల్ స్ట్ర్రైక్ వివరాలు ఇవ్వండి

కాగా రెండు పార్టీల మధ్య భద్రతా దళాల వార్ నుడుస్తున్న నేపథ్యంలనే 2004 నుండి 2014 వరకు పాకిస్థాన్ పై ఎన్ని సర్జికల్ స్ట్ర్రైక్స్ జరిగాయి .2014 సెప్టెంబర్ అనంతం జరిగిన సర్జికల్ స్ట్ర్రైక్స్ విజయాలు ఎవైనా ఉన్నాయా అంటూ జమ్ముకు చెందిన ఓ వ్యక్తి ఆర్టీఐ ద్వార భద్రతాదళ అధికారులను అడిగారు.

2016 కు ముందు సర్జికల్ స్ట్ర్రైక్స్ వివరాలు లేవు

2016 కు ముందు సర్జికల్ స్ట్ర్రైక్స్ వివరాలు లేవు

కాగా ఆర్టీఐ ద్వార అప్లికేషన్ స్వీకరించిన భద్రతాదళాలు దానికి సమాధానాన్ని ఇచ్చాయి. 2016కు ముందు జరిగిన స్ట్ర్రైక్స్ప వివరాలు లేవని తేల్చి చెప్పింది. అయితే ఇండియన్ ఆర్మీ 2016లో లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట సెప్టెంబర్ 2016లో సర్జికల్ స్ట్ర్రైక్స్ జరిగాయని అయితే ఆ సమయంలో ఎవరు చనిపోలేదని తెలిపింది. లెఫ్టినెంట్ కల్నల్ ఏడిఎస్ జస్రోటియా అనే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి సమధానం ఇచ్చారు. యూరీ దాడిలో భారత సైన్యం 19 మంది మృత్యువాత పడ్గ అనంతరం 11 రోజుల తర్వాత ఎల్వోసీ వెంట భారత సైన్యం సర్జికల్ స్ట్ర్రైక్స్ నిర్వహించింది. అదే విషయాన్ని భద్రతా బలగాలు తెలిపాయి.

English summary
In its reply to an RTI, which sought to know how many surgical strikes on Pakistan were carried out during the UPA era, the Indian Army Tuesday said it does not have any data about them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X