వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తూచ్ .. డేరా పెరోల్‌పై నిర్ణయం తీసుకోలేదు ... కట్టార్ క్లారిఫై

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : డేరా సచ్చా సౌద అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ పెరోల్‌పై బయటకు వస్తున్నారనే ఊహగానాలను హర్యానా సర్కార్ ఫుల్‌స్టాప్ పెట్టింది. గుర్మీత్ పెరోల్‌కు సంబంధించి జైలు అధికారులు సానుకూలం వ్యక్తం చేశారని ... ఓ మంత్రి కూడా దీనిపై స్పందించినట్టు వార్తలొచ్చాయి. అయితే గుర్మీత్ పెరోల్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేమని హర్యానా సర్కార్ స్పష్టంచేసింది.

డిసిషన్ తీసుకోలేదు ..
గుర్మీత్ బయటకు వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని వాదన కూడా ఉంది. దీనిని పోలీసు ఉన్నతాధికారులు కూడా హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టార్‌కు తెలియజేశారు. దీంతో సీఎం కట్టార్ స్పందించారు. గుర్మీత్ విడుదలకు సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని స్పష్టంచేశారు. అతనికి పెరోల్ ఇస్తున్నామనే ఊహాగానాలు తప్పని పేర్కొన్నారు. తాను దేవుడునని ప్రకటించుకున్న గుర్మీత్ .. ఇద్దరు మహిళలపై లైంగిక దాడి చేశాడు. ఈ కేసులో సాక్ష్యాధారాలు పరిశీలించిన కోర్టు .. అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

No decision yet on parole for Ram Rahim, says Haryana CM Manohar Lal Khattar

అబ్బే అదేం లేదే ...
అయితే ఓ వ్యక్తి జైలు నుంచి విడుదలకు సంబంధించిన ప్రక్రియ న్యాయపరమైనదని కట్టార్ పేర్కొన్నారు. అలాగే సత్పవర్తన కలిగి ఉన్న వారిని తాము ఎవరినీ జైలులో ఉంచుకోమని స్పష్టంచేశారు. అయితే గుర్మీత్ సత్ప్పవర్తన వల్ల హర్యానా ప్రభుత్వం అతని విడిచిపెట్టేందుకు సముఖంగా ఉన్నట్టు వార్తలు వినిపించాయి. అయితే జైలులో ఉన్న వ్యక్తి పెరోల్ అడగడం తన హక్కు అని హర్యానా మంత్రి అనిల్ విజ్ మీడియాతో పేర్కొనడంతో .. గుర్మీత్ పెరోల్ చర్చకు దారితీసింది. అయితే శాంతిభద్రతల ఇష్యూతో .. హర్యానా సర్కార్ వెంటనే చర్యలు ప్రారంభించింది. గుర్మీత్‌ విడుదలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సీఎం కట్టార్ తేల్చిచెప్పారు.

English summary
haryana Chief Minister Manohar Lal Khattar has said that no decision has been taken yet on granting parole to Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim. The self-styled godman, currently serving a 20-year sentence for raping two women, has sought parole of 42 days for tending the sprawling fields in his sect's headquarters in Sirsa town, some 250 km from Chandigarh. Speaking on the matter, Manohar Lal Khattar said, "There are certain legal procedures and a person who has the right to seek parole can seek it. We can't stop anyone. As of now, no decision has been taken on Ram Rahim's parole."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X