వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షహీ‌న్‌బాగ్ ఆందోళనలపై చర్చించలే,దేశం గర్వించేస్థాయిలో ఢిల్లీని అభివృద్ధి చేద్దాం: కేజ్రీవాల్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కుమారుడు అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. తన ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇతర రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించని కేజ్రీవాల్.. ప్రధాని మోడీని మాత్రం ఇవ్వైట్ చేశారు. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. వివిధ అంశాలపై చర్చించామని కేజ్రీవాల్ తెలిపారు.

నార్త్‌బ్లాక్‌లో బుధవారం అమిత్ షాతో సమావేశమయ్యానని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ మేరకు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. తమ మధ్య వివిధ అంశాలపై సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని చెప్పారు. తాము కలిసి పనిచేయాలని అనుకొన్నట్టు గుర్తుచేశారు. ఢిల్లీ అభివృద్ది కోసం కలిసికట్టుగా పనిచేస్తామని ట్వీట్‌లో పేర్కొన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేజ్రీవాల్ తొలిసారి అమిత్ షాతో సమావేశమయ్యారు.

No discussion on Shaheen Bagh: Arvind Kejriwal after meeting Amit Shah

అమిత్ షాతో సమావేశంలో షషీన్‌బాగ్ ఆందోళనలపై చర్చ జరగలేదని కేజ్రీవాల్ స్పష్టంచేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ గత కొంతకాలంతో షహీన్‌బాగ్‌లో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తన మంత్రులతోపాటు అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి రావాలని ప్రధాని మోడీని పిలిచినా..

వారణాసిలో బిజీగా ఉండటంతో హాజరుకాలేదు. కేజ్రీవాల్‌కు అంతకుముందే మోడీ అభినందనలు తెలిపారు. దానికి కేజ్రీవాల్ సమాధానం కూడా ఇచ్చారు. మోడీ వారణాసిలో బిజీగా ఉన్నారని తెలుసు, కానీ ఢిల్లీ అభివృద్ధి కోసం మాత్రం కలిసి పనిచేద్దామని కేజ్రీవాల్ తెలిపారు. దేశం గర్వించస్థాయిలో ఢిల్లీ నగరాన్ని అభివృద్ధి చేద్దామని ప్రధాని మోడీకి ఇచ్చిన సమాధానంలో కేజ్రీవాల్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

English summary
Delhi Chief Minister Arvind Kejriwal said there was no discussion on Shaheen Bagh during his meeting with Union Minister Amit Shah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X